ఇంట్లోని పిల్లలు రేపు పెరిగి పెద్దయ్యాక సమాజంలోకి ఎలా అడుగుపెడతారు? కేవలం మార్కులు, ర్యాంకులు సాధిస్తే సరిపోతుందా? క్రమశిక్షణ తప్పారని టీసీ ఇచ్చినంత మాత్రాన, కన్నతల్లిలాంటి ఉపాధ్యాయురాలిపైనే కక్ష పెంచుకుని 27 సార్లు దారుణంగా పొడిచి చంపేంత క్రూరత్వం ఈనాటి విద్యార్థుల్లోకి ఎలా వస్తోంది? మన విద్యావ్యవస్థలో అక్షరాలను నేర్పిస్తున్నాం సరే… మరి నైతిక విలువలను, గురువులను గౌరవించే సంస్కారాన్ని నేర్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నామా? అక్షరం నేర్పే గురువునే కడతేర్చేంత కిరాతక ఆలోచనలు మన నవ సమాజంలో రూపుదిద్దుకోవడం వెనుక ఉన్న అసలు దోషి ఎవరు?
………………………………………………………………..
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ అయిన కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసు మిస్టరీ వీడింది. జేబీ కాలనీలోని తన నివాసంలో భర్త లేని సమయంలో ఆమెను పదునైన ఆయుధంతో దాదాపు 27 సార్లు పొడిచి అత్యంత కిరాతకంగా చంపేశారు. మొదట ఇది ఆస్తి లేదా పగ కోణంలో జరిగిన హత్యగా భావించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపితే బయటపడిన నిజం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ఈ ఘాతుకానికి పాల్పడింది ఆ పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్న విద్యార్థులే. నిందితుల్ని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
…….
ఈ దారుణానికి ప్రధాన కారణం… అల్లరి చేస్తున్నందుకు ప్రిన్సిపాల్ తనకు టీసీ (TC) ఇచ్చిందన్న కక్ష. కొంతమేర డబ్బు అవసరం కావడమేనని తెలుస్తోంది. పథకం ప్రకారం ఇంట్లోకి జొరబడి ప్రిన్సిపాల్‌ను దారుణంగా హత్య చేయడమే కాకుండా, ఇంట్లో ఉన్న సుమారు రూ.4 లక్షల నగదును కూడా చోరీ చేశారు. విద్యాబుద్ధులు నేర్పే బడిలో, తప్పు చేస్తే మందలించడమో లేదా టీసీ ఇవ్వడమో గురువుగా ఆమె బాధ్యత. కానీ, ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక, పగ పెంచుకుని, సొంత ప్రిన్సిపాల్‌నే ప్లాన్ చేసి చంపేశారు. పదో తరగతి చదివే చిన్న వయసులోనే రావడమనేది విద్యావ్యవస్థకే పట్టిన పీడకల.
….
ఈ రోజు రూపారెడ్డి గారికి జరిగిన ఈ ఘోరం రేపు మరో ఉపాధ్యాయుడికి జరగదని గ్యారెంటీ ఉందా? చట్టాలు, పోలీసు కేసులు ఎన్ని ఉన్నా… ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు పిల్లలను గమనించాలి. మార్కులతో పాటు మానవత్వాన్ని, క్రమశిక్షణను, నైతిక విలువలను నింపనంత కాలం ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయలేము. కేవలం ఐఫోన్లు, సౌకర్యాలు ఇవ్వడమే బాధ్యత అనుకోకుండా పిల్లల మనసుల్లో ఎలాంటి విపరీత ఆలోచనలు వస్తున్నాయో గమనించాలి. ఇప్పటికైనా విద్యావ్యవస్థ, సమాజం కళ్ళు తెరిచి పిల్లల్లో నైతిక విద్యకు, విలువలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
……
ఈ దారుణమైన సంఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. భారతీయ ధర్మాన్ని, సాంప్రదాయాలను మరియు మన జాతీయవాదాన్ని స్పష్టమైన స్వరంతో అందరికీ వినిపిస్తున్న మన ‘మై ఇండ్ మీడియా’ యూట్యూబ్ ఛానెల్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేయండి. సమాజంలో చైతన్యాన్ని నింపేందుకు, ఈ కీలకమైన సందేశం ప్రతి ఒక్కరికీ చేరేలా ఈ వీడియోను మీ మిత్రులు, కుటుంబ సభ్యులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.



