—
నమస్తే! ఫ్యాకల్టీస్ ను లక్ష్యంగా చేసుకుని కుల రాజకీయాలు చేయడం… ఉద్దేశపూర్వకంగా బురదజల్లడం పరిపాటిగా మారింది. పరీక్షలో కాపీ కొడుతూ దొరికిపోయిన విద్యార్థి కి కులం కార్డు తగిలించారు. అతడి కాపీ పట్టుకొన్న ప్రొఫెసర్ మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు.
బాధితుడు అయిన తెలుగు ప్రొఫెసర్ కు మద్దతుగా ఐఐటీ బొంబాయి ఫ్యాకల్టీ ఫోరమ్ రంగంలోకి దిగింది. ఈ ఉదంతం వెనుక ఉన్న అసలు నిజాల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఐఐటీ బొంబాయిలో సహిల్ వాకోడే అనే విద్యార్థి స్మార్ట్‌ఫోన్ ద్వారా కాపీ కొడుతూ దొరికిపోయాడు. ఇన్విజిలేటర్ గా ఉన్న ప్రొఫెసర్ సూర్యనారాయణ.. ఈ విషయాన్ని యాజమాన్యానికి నివేదించారు. అయితే ఆ తర్వాత ఆ విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనను ఆసరాగా చేసుకుని కొందరు కావాలనే కుల రాజకీయాలను తెరపైకి తెచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ప్రొఫెసర్‌పై దారుణమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు.
తెలుగు వాడైన ప్రొఫెసర్ సూర్యనారాయణ.. ఇక్కడే ఇంజనీరింగ్ చేశారు. తర్వాత బాంబే ఐ ఐ టీ లో ఉద్యోగం మొదలు పెట్టారు. అనేకసార్లు ఐ ఐ టీ పరీక్షలను నిజాయతీగా నిర్వహించారు. స్టూడెంట్ డీన్ గా ఉన్నప్పుడు కమ్యూనిస్టుల కార్యకలాపాలను కంట్రోల్ చేశారు. ఇది మనస్సులో పెట్టుకొన్న వామపక్ష సంఘాలు.. ఆయన మీద కక్ష కట్టాయి. తప్పుడు కేసులు పెట్టించి, వేధించాలని కుట్ర చేస్తున్నాయి.
………………………………………………………………….
ఈ తప్పుడు ప్రచారంపై ఐఐటీ బొంబాయి ఫ్యాకల్టీ ఫోరమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రొఫెసర్ సూర్యనారాయణ కేవలం తన విధి నిర్వహణ మాత్రమే చేశారని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం నడుచుకున్న ఒక గౌరవప్రదమైన ప్రొఫెసర్ పరువు తీయడం సరికాదని కుండబద్దలు కొట్టింది. విద్యాసంస్థల్లో నిబంధనలను అమలు చేసే ప్రొఫెసర్లకు అండగా నిలుస్తామని, నిజాయితీగా పనిచేసే వారిపై కుల రంగు పులమడం దారుణమని తేల్చి చెప్పింది.
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!



