—……………………………….
నమస్తే! హిందూ పండుగల పవిత్రతను కాపాడటానికి ప్రయత్నించే సంస్థలపై బురదజల్లడం మీడియాలోని కొందరు అర్బన్ నక్సలైట్స్ కు అలవాటుగా మారింది. పైగా హిందూ ఆధ్యాత్మిక సంస్థల మీద టెర్రరిస్టులు అని ముద్ర వేస్తున్నారు. నవరాత్రి వేడుకల్లోకి అన్యమతస్థుల ప్రవేశాన్ని నిరోధించాలని విశ్వహిందూ పరిషత్ పిలుపు ఇచ్చింది. ఈ వంకతో కొన్ని పత్రికలు.. VHPని ఏకంగా “హిందూ తాలిబాన్” అని ముద్ర వేస్తున్నాయి. బహిరంగంగా చేసిన రిక్వెస్ట్ ను “ఫత్వా” అని సంబోధించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన వివరాలు ఇప్పుడు చూద్దాం.
………………………………………..
నవరాత్రి వేడుకలు వినోదం కోసం కానే కాదన్నది వాస్తవం. అమ్మవారి పూజ అంటే పవిత్రమైన హిందూ పండుగ అని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో, ఉత్సవాల పవిత్రతను కాపాడటానికి పరిషత్ క్రషి చేస్తోంది. అందుకే గర్బా డ్యాన్స్ లలోకి అన్యమతస్థులను అనుమతించవద్దని విజ్ఞప్తి చేస్తోంది. కానీ, దీనికి కొందరు సెక్యులర్ వాదులు పెడర్థాలు తీస్తున్నారు.
….
ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ.. హిందూ పండుగలను వ్యాపారాత్మక కార్యక్రమాలుగా చిత్రీకరించారు. విహెచ్పి ఇచ్చే పిలుపులను “ఫత్వా” అని వాగుతున్నారు. ఆధ్యాత్మిక సంస్థ విశ్వ హిందూ పరిషత్ ను “హిందూ తాలిబాన్” అని ముద్ర వేస్తున్నారు. అఫ్గానిస్థాన్‌లో మహిళల హక్కులను కాలరాస్తున్న తాలిబాన్లతో, ఒక హిందూ ధార్మిక సంస్థను పోల్చడం చాలా చాలా తప్పు. పరిషత్ చేస్తున్న మంచి పనులను తట్టుకోలేక ఇటువంటి బ్రాండింగ్ చేస్తున్నారన్న మాట…………………………………..
హిందూ పండుగలను, ధార్మిక సంస్థలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన అంశం. పండుగల పవిత్రతను కాపాడుకోవడం భక్తుల ప్రాథమిక హక్కు. మీడియా ముసుగులో జాతీయవాద సంస్థలపై “హిందూ తాలిబాన్” వంటి పదాలతో బురదజల్లే యత్నాలను హిందూ సమాజం ఎన్నటికీ సహించదు.
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!




