…………………….
ప్రజా సంక్షేమం అంటే కేవలం పథకాలు ఇవ్వడమేనా? లేక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడమా? ఒక ఐఏఎస్ అధికారి నిజాయితీగా పనిచేస్తే ఎలాంటి సంచలనాలు సృష్టించవచ్చో మహారాష్ట్రను చూసి నేర్చుకోవాల్సిందే? ఆహారంలో కల్తీలు, నాసిరకం మందుల దందాలకు చెక్ పెడుతూ వ్యవస్థను పరుగులు తీయిస్తున్న ఆ పవర్ ఫుల్ ఆఫీసర్ ఎవరు? ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ, కల్తీ రాయుళ్ల నడుము విరుస్తున్న ప్రభుత్వం అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం!
………………………………………………………………………………..
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) డివిజన్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టిన తుకారాం ముండే పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన కల్తీ ఆహారం, నాసిరకం ఫార్మా కంపెనీలపై సింహస్వప్నంగా మారారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, స్వీట్ షాప్‌లు, డ్రైఫ్రూట్స్ గోదాములు మరియు ఔషధ తయారీ యూనిట్లపై తుకారాం ముండే వరుస దాడులు నిర్వహిస్తున్నారు. కోట్ల విలువైన అనారోగ్యకరమైన, కల్తీ మెటీరియల్‌ను, గడువు ముగిసిన మందులను స్పాట్లోనే సీజ్ చేస్తూ అక్రమార్కుల గుండెల్లో భయం పుట్టిస్తున్నారు.
……
ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే ఎంతటి పెద్ద కంపెనీలనైనా, వ్యాపారులనైనా ఆయన అస్సలు వదలడం లేదు. అనుమతులు లేని షాపులను సీజ్ చేయడం, కల్తీ పాలు, కల్తీ నూనె వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టడం ద్వారా వ్యవస్థల్లో కొత్త చైతన్యాన్ని తెచ్చారు. ప్రజల ఆరోగ్యాన్నే పరమావధిగా భావించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చూపిస్తున్న దూకుడు మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తుకారాం ముండే పవర్ ఫుల్ కాంబినేషన్‌తో నాణ్యతా ప్రమాణాలు పాటించని ఫార్మా పరిశ్రమలు, ఆహార తయారీ కేంద్రాలు ఇప్పుడు గజగజ వణికిపోతున్నాయి.
……………………………………………………………………………
అయితే, ఒక అధికారి ఇంత స్వేచ్ఛగా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా పని చేయగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని బీజేపీ – శివసేన ప్రభుత్వమే. నిజాయితీ గల ఆఫీసర్‌కు ప్రభుత్వం పూర్తిస్థాయిలో ‘ఫ్రీ హ్యాండ్’ ఇవ్వడం వల్లే ఈ అద్భుతం సాధ్యమైంది. రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా, ప్రజా ఆరోగ్యం విషయంలో రాజీపడేది లేదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. మంచి అధికారులను ప్రోత్సహిస్తూ, పాలనలో అద్భుతాలు సాధించవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం నిరూపించి చూపించింది. దీనికి మద్దతు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. డబుల్ ఇంజన్ సర్కార్ స్ఫూర్తిని సాకారం చేస్తోంది.
……………………………….
ప్రజా ఆరోగ్యం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న నిజాయితీ గల అధికారుల గురించి, అలాగే వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నిష్పక్షపాత విశ్లేషణను, భారతీయ జాతీయవాదాన్ని గొంతెత్తి వినిపిస్తున్న మన ‘మై ఇండ్ ఛానెల్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేయండి. సమాజంలో మంచి మార్పును కోరుకునే ప్రతి ఒక్కరికీ చేరేలా ఈ వీడియోను మీ మిత్రులు, కుటుంబ సభ్యులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.




