………………………………………………
సనాతన ధర్మ ప్రచారకర్త, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీకి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో సనాతన ధర్మం, ఆధ్యాత్మికత కు అందిస్తున్న విశేష సేవలకు గాను ప్రతిష్ఠాత్మకమైన “పార్లమెంటరీ జీవితకాల గౌరవ పురస్కారం” లభించింది. సనాతన ధర్మంలో అంతర్భాగమైన మానవ సేవ విశ్వసమానత్వ భావనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ నిరంతరం శ్రమిస్తున్నారు. మారుతున్న ఆధునిక సమాజంలో సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని చాటుతూ లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆయన రగిలిస్తున్నారు.
శ్రీ రాధా మనోహర్ దాస్ నిరంతరాయంగా పర్యటనలు చేస్తూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతీ జిల్లా, పట్టణం తిరిగేశారు. ప్రతీ చోట హరే కృష్ణ అంటూ పలకరించటం, సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటం చేస్తుంటారు. ఖాళీ దొరికినప్పుడల్లా సనాతన ధర్మం మీద ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ధర్మ ప్రచారం చేస్తూ ఉంటారు.
…………………………
…………….
ప్రస్తుతం స్వామీ జీ ఆస్ట్రేలియా లో పర్యటిస్తున్నారు. అక్కడ కూడా సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నారు.
సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక పురోగతి కోసం స్వామీజీ కృషిని గుర్తించి ఆస్ట్రేలియా ప్రభుత్వం “పార్లమెంటరీ జీవితకాల గౌరవ పురస్కారం తో గౌరవించింది. విక్టోరియన్ పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలో ఆస్ట్రేలియా ఎంపీ నటాలీ హచిన్స్ ఈ అవార్డుని బహుకరించారు. ఈ వేదిక మీదనే స్వామీజీ సేవలను ఎంపీ నటాలీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పార్లమెంటు ప్రతినిధులతో స్వామీజీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సనాతన ధర్మం గొప్పతనాన్ని స్వామీ తెలియచేశారు.
………………
స్వామీజీ ఆస్ట్రేలియా మీటింగ్ (కాన్ఫరెన్స్ రూమ్ లో అయిదారు మంది కూర్చొన్నారు కదా. అది వేసుకోవాలి. చిన్న బిట్ సరిపోతుంది.)
……………………………………..
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా… సనాతన ధర్మం కోసమే స్వామీజీ పోరాడుతూ ఉంటారు. ఈ పోరాటంలో ఆయన ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కావు. స్వామీజీ ప్రశ్నలను సూటిగా ఎదుర్కోలేక, వెనుక దొంగ ప్రచారాలు చేసేవాళ్ల సంఖ్య ఎక్కువ. అయినా సరే, స్వామీజీ ఎక్కడా తగ్గలేదు. సనాతన ధర్మం కోసం సాహసంతో పోరాడుతూ వెళుతున్నారు. పరాయి మతాల బండారాన్ని ఎప్పటికప్పుడు లైవ్ లోనే బయట పెట్టేస్తూ ఉంటారు.
………..
………………
ఒకప్పుడు స్వామి వివేకానందుల వారు ప్రపంచ దేశాలలో హిందూ మతం గొప్పతనాన్ని చాటిచెప్పారు. ఇతర దేశస్తులతో శెభాష్ అనిపించుకొన్నారు. తాజాగా రాధామనోహర్ దాస్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం చేతనే అభినందనలు అందుకొన్నారు. “పార్లమెంటరీ జీవితకాల గౌరవ పురస్కారం అందుకోవటం అంటే మాటలు కాదు మరి. ఇంతటి గొప్ప స్వామీజీ మాటలు, చేతలను మనం అంతా ఫాలో కావాలి. స్వామీ చెబుతున్న బాటలో నడుస్తూ సనాతన ధర్మానికి కట్టుబడాలి. పరాయి మతాల్ని దూరం పెడుతూ ముందుకు సాగాలి.



