……………………………….
నమస్తే! రాజకీయ ముసుగులో ఉన్న నాయకుల అసలు స్వరూపాలు, వారి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారం చేతిలో ఉంది కదా అని ఎంతటి ఘోరానికైనా తెగిస్తారా? దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశ సాలియాన్ మరణం వెనుక రాక్షస కోణం వెలుగులోకి వచ్చింది. శివసేన నాయకుడు, మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే దారుణాలు బయట పడ్డాయి. ఆయన్ని కాపాడేందుకే ఆనాడు ఒక అమాయక యువతి ప్రాణాలను బలి తీసుకున్నారా? ఈ కేసులో ఇన్నాళ్లూ కప్పిపుచ్చిన సంచలన నిజాలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
…………………………………………………………….
2020 జూన్ 8న రాత్రి దిశ సాలియాన్పై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, ఆపై హత్య చేశారు. ఈ దారుణ నేరాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆనాటి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుట్రలు చేసింది. ఆదిత్య థాకరే, అతని అనుచరులను కాపాడేందుకే ఈ ఘోరానికి ఒడిగట్టారు. మాల్వానీ పోలీసు స్టేషన్లో నమోదైన కొత్త ఎఫ్ఐఆర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దిశ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించినా, వ్యవస్థను వాడుకుని ఆమెను నిశ్శబ్దం చేశారు.
…..
ఆ రోజు రాత్రి జరిగిన నిజాలను దాచేందుకు ఆధారాలను కుట్రపూరితంగా ధ్వంసం చేశారు. పోస్ట్‌మార్టం నివేదికలను మార్చారు. సీసీటీవీ ఫుటేజీలను మాయం చేశారు. సాక్షులను, దిశ కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించారు. నాటి రాజకీయ పెద్దలు, పోలీసు అధికారులు కలసి ఈ హత్యను ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశారు. అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్టగా నిలిచింది.
…………………………………………………………
రాజకీయ అధికారం ఉందనే అహంకారంతో ఎంతటి తీవ్రమైన నేరాన్నైనా కప్పిపుచ్చవచ్చని అనుకోవడం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఒక అమాయక యువతి జీవితాన్ని నాశనం చేసి, ఆమె కుటుంబాన్ని భయాందోళనకు గురిచేసిన ఎంతటి పెద్ద రాజకీయ నాయకులైనా చట్టం ముందు సమానులే. ఈ కేసును పారదర్శకంగా విచారించి, దిశ సాలియాన్కు న్యాయం జరిగేలా దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత విచారణ సంస్థలపై ఉంది.
……………….
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి అక్రమాలను, నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!




