……………………………………………..
నమస్తే! కామెడీ పేరుతో దేశ ప్రధానిని, వారి కుటుంబాన్ని అవహేళన చేయడం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి బాగా అలవాటు. దాని మీద వివాదం చెలరేగగానే విక్టిమ్ కార్డ్ వాడుతూ నాటకాలు ఆడటం కూడా ఆయనకు బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ వేదికపై … ప్రధాని నరేంద్ర మోదీని కించపరుస్తూ కమేడియన్ పుల్కిత్ మణి రచ్చ చేశారు. ఆ తర్వాత ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవ్వడంతో… విక్టిమ్ డ్రామా మొదలుపెట్టారు. ఈ చవకబారు రాజకీయం వెనుక ఉన్న నిజాల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
………………………………………………..
ఇండోర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీతో కలిసి పుల్కిత్ మణి ఒక నాటకం ఆడారు. ప్రధాని మోదీని, వారి తల్లి గారిని ఉద్దేశించి కామెడీ చేశారు. కాంగ్రెస్ నాయకులు దీనిని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అయితే, ఈ చవకబారు కామెడీ పై దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని పదవిని అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నిరసనల దెబ్బకు .. తర్వాత షోలను రద్దు చేసుకోక తప్పలేదు. అయితే, తాను చేసిన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా, తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం ప్రారంభించారు. అండర్‌గ్రౌండ్ అయిపోతున్నానని మీమ్స్ పెడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చే స్క్రిప్టులతో రాజకీయాలు చేసి, తీరా ప్రజలు తిప్పికొట్టగానే బాధితుడిలా నటిస్తున్నారు. దీనిని రాహుల్ గాంధీ ప్రోెత్సహించటం మరీ విడ్డూరం. దేశ ప్రతిపక్ష నేత .. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయటం దారుణం.
………………………………………………………..
హాస్యం పేరుతో దేశ నాయకులను, వారి కుటుంబ సభ్యులను అవమానించడం పద్ధతి కాదు. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వారిని ప్రోత్సహిస్తోంది. అధిక శాతం రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ .. నిస్సహాయ స్థితిలో ఇలాంటి డ్రామాలు చేస్తోంది. సానుభూతి డ్రామాలతో ప్రజల్ని తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
…………………………………..
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!



