చర్చిల మత మార్పిడులపై పక్కా ఆధారాలు బట్టబయలు..
—
నమస్తే! సేవా కార్యక్రమాల ముసుగులో మత మార్పిడులకు పాల్పడుతున్న శక్తుల అసలు స్వరూపాలు బయటపడుతున్నాయి. విదేశీ డబ్బుతో దేశ శాంతిభద్రతలను దెబ్బతీయడానికి ఎంతటి పెద్ద కుట్రలు జరుగుతున్నాయో వెలుగులోకి వచ్చింది. ఆప్ ఇండియా సంస్థ చేసిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ప్రభావంతో అమెరికాకు చెందిన క్రిస్టియన్ మిషనరీ సంస్థ ‘ది తిమోతీ ఇనిషియేటివ్’ పై కేసు నమోదు అయింది. విదేశీ నిధుల దుర్వినియోగం, మత మార్పిడి కుట్రల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
…………………………………………………………..
అమెరికా మిషనరీ సంస్థ ‘ది తిమోతీ ఇనిషియేటివ్’ విదేశీ నిధులను భారతదేశానికి తరలించి FCRA నిబంధనలను బొందపెట్టింది. ఎలాంటి అనుమతులు లేని స్వచ్ఛంద సంస్థలకు కోట్ల రూపాయల నిధులను చట్టవిరుద్ధంగా మళ్లించింది. ఈ నిధులన్నింటినీ భారతదేశంలో పెద్ద ఎత్తున మత మార్పిడులు చేయడానికి మరియు చర్చిలను స్థాపించడానికి ఉపయోగించారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ దందాను నడిపారు.
…………………………………
మరింత దారుణమైన విషయమేమిటంటే, ఈ విదేశీ నిధులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు పంపించారు. అక్కడ నక్సలిజం వ్యాప్తికి, మత మార్పిడులకు ఈ డబ్బులను వినియోగించారు. నక్సలైట్లకు పెద్ద ఎత్తున చందాలు అందించి, చర్చి లను విస్తరించరు. దేశ అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పు కలిగించేలా ఈ డబ్బును పంపిణీ చేశారు. ఆప్ ఇండియా సంస్థ… ఈ కుట్రల గురించిన ఆధారాలను బయటపెట్టడంతో సీబీఐ రంగంలోకి దిగింది. నిందితులపై కుట్ర, మోసం మరియు ఎఫ్సిఆర్ఏ ఉల్లంఘన కేసులను నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది
…………………………………………
సేవ పేరుతో వచ్చి దేశ సార్వభౌమత్వాన్ని, సంస్కృతిని నాశనం చేయడానికి కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. విదేశీ నిధులతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఇటువంటి నెట్‌వర్క్‌లను సమూలంగా అంతం చేయాలి. ఈ కుట్ర వెనుక ఉన్న పాత్రధారులందరినీ అరెస్టు చేయాలి. తెర వెనుక ఉన్న సూత్రధారులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఉంది.
…………………………………………….
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!



