…………………………………………………..
ప్రేమ, స్నేహం పేరుతో వల విసిరి మన కుటుంబాలను నాశనం చేసే మాయగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి సుమా..? సోషల్ మీడియాలోనో, బయటనో పరిచయమై మన ఇంట్లోని ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకుందామా? ఒక నమ్మకమైన కుటుంబాన్ని నట్టేట ముంచిన ఆ ముసుగు వీరుడు ఎవరు? లవ్ జిహాద్ పేరుతో, వేధింపుల పేరుతో మన సమాజంలో ఊపందుకుంటున్న ఈ కొత్త రకం నేరాలకు అడ్డుకట్ట వేయడం ఎలా? ఈ రోజు కాకినాడలో జరిగిన ఈ దారుణమైన ఘటన ప్రతీ కుటుంబానికి ఎలాంటి హెచ్చరికను ఇస్తోంది?
………………………………………………………………………………..
… ( షార్ట్ వీడియో స్టార్ట్ )..
కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ చేసిన దారుణాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. సౌజన్య అనే మహిళను ట్రాప్ చేసి, ఆమె జీవితంతో ఆడుకోవడమే కాకుండా… ఆ కుటుంబంలో కల్లోలం సృష్టించాడు. సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య అంతా కలిసి గోదావరి నదిలోకి దూకేశారు. ఈ ఘోరంలో కుటుంబం మొత్తం నాశనం అయిపోయారంటే ఎంత దారుణం… కేవలం పదేళ్ల చిన్నారి కార్తికేయరెడ్డి మాత్రమే ప్రాణాలతో బయటపడి ఈ నరకాన్ని కళ్లారా చూశాడు…
…….
ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా మరో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 45 రోజుల క్రితం సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి అనారోగ్యంతో చనిపోయాడని భావించారు. అది సాధిక్ ఖాన్ చేసిన విష ప్రయోగమేనని సౌజన్య రాసిన లేఖ ద్వారా బయటపడింది. భర్తను చంపేసి, ఆ కుటుంబాన్ని బెదిరిస్తూ సాధిక్ ఖాన్ నరకం చూపించాడు. ఇటువంటి దుర్మార్గులు, లవ్ జిహాద్ నిపుణులు సమాజంలో అనేకమంది మహిళల జీవితాలతో ఆడుకుంటూ కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ కిరాతకుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
….. ( షార్ట్ వీడియో ఎండ్ )….
……………………………………………………………………………………….
ఈ భయంకరమైన సంఘటన మన కళ్ళు తెరిపించాలి. మన ఇంట్లో ఉన్న పిల్లలు, మహిళలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరి మాయమాటల్లో పడుతున్నారు అనేది తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలి. నమ్మించి మోసం చేసే సాధిక్ ఖాన్ లాంటి లవ్ జిహాద్ ముఠాల పట్ల, సైకోల పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా విషాదం తప్పదు. తప్పులు జరుగుతున్నప్పుడు భయపడి ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఇటువంటి దుర్మార్గుల ముసుగులు తీసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది.
……………………………………
ఈ దారుణమైన ఘటనపై మరియు సమాజంలో పెరిగిపోతున్న ఇలాంటి ముప్పులపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ధర్మాన్ని, సంస్కృతిని, భారతీయ జాతీయవాదాన్ని స్పష్టమైన స్వరంతో అందరికీ వినిపిస్తున్న మన ‘మై ఇండ్ మీడియా’ యూట్యూబ్ ఛానెల్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేసేందుకు, ఈ ముఖ్యమైన విశ్లేషణాత్మక వీడియోను మీ మిత్రులు, కుటుంబ సభ్యులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.




