నమస్తే! దేశ భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇచ్చే భావజాలం అధికారంలోకి వస్తే మార్పు ఎలా ఉంటుందో పశ్చిమ బెంగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించి, సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారగానే జాతీయ భద్రతకు పెద్ద పీట వేస్తూ సువేందు అధికారి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొంటోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఏకంగా 252 అక్రమ మదరసాలను మూసివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన సంచలన ఉత్తర్వుల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
…………………………………………………
గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే పనిచేసింది. జాతి వ్యతిరేక శక్తులను తయారు చేస్తున్న అక్రమ మదరసాలను పట్టించుకోకుండా వదిలేసింది. కానీ, సువేందు అధికారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ భద్రతపై ఏమాత్రం రాజీపడేది లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనలను విద్యాసంస్థలు ఏ రకంగా పాటిస్తున్నాయి అనేది అధ్యయనం చేశారు. నిబంధనలు పాటించని 252 అక్రమ మదరసాలను తక్షణమే మూసివేయాలని నిర్ణయించారు. ఈ మదర్సాలలో ప్రభుత్వ సిలబస్ కు బదులుగా దేశ వ్యతిరేక అంశాలు బోధిస్తున్నట్లు గుర్తించారు.
…………………
మైనార్టీ రాజకీయాలను పక్కన పెట్టి, చట్టానికి ఎవరూ అతీతులు కారనే సంకేతాన్ని ఇచ్చారు. విద్యా వ్యవస్థ ముసుగులో ఎలాంటి అరాచకాలు జరగటానికి వీల్లేదని స్పష్టం చేసింది. దేశ సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో దేశ వ్యతిరేక అంశాలు బోధిస్తే కొంప మునుగుతుంది. అందుకే అక్కడ బీజేపీ ప్రభుత్వం జాతీయ భద్రతకు, శాంతిభద్రతలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోంది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అంతటా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి………………………………………………………….
దేశ భద్రత, చట్టబద్ధ పాలన మాత్రమే ముఖ్యం అని నిరూపించిన సువేందు అధికారి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం.
అక్రమ వ్యవస్థలపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడమే నిజమైన జాతీయవాద పాలనకు నిదర్శనం. పశ్చిమ బెంగాల్లో మొదలైన ఈ మార్పు సానుకూల ఫలితాలను ఇస్తుందనడంలో సందేహం లేదు. దేశమే ముఖ్యం అన్న బీజేపీ స్ఫూర్తిని బెంగాల్ లో సువేందు అధికారి ప్రభుత్వం అమలు చేస్తోంది.
…………………………………………………….
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!



