………………………………………………
నమస్తే! మత మార్పిడులు, చర్చి కార్యకలాపాలను అడ్డుకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారా? దళిత సమాజ రక్షణ కోసం వచ్చిన చట్టాన్ని, మత మార్పిడులకు రక్షణ కవచంగా వాడుకుంటున్నారా? క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను చూపిస్తూ అబద్ధపు కేసులు పెట్టడం వెనుక ఉన్న కుట్ర ఏమిటి? అసలు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు ఇచ్చిన సంచలన తీర్పులు ఏమి చెబుతున్నాయి? ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
…………………………………………………………………
మన దేశంలో మత మార్పిడుల కోసం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చర్చి కార్యకలాపాలు, అక్రమ మత మార్పిడులను స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే, కొంతమంది దళిత క్రైస్తవులు వారిపై వెంటనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. చట్టంలోని కఠిన నిబంధనలను ఆసరాగా చేసుకుని, ఎదురు తిరిగిన వారిపై కక్షసాధింపులకు దిగుతున్నారు. దీంతో చర్చిలు చెలరేగిపోతున్నా, ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది.
…….
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇతరులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారు. దీనిరి ఏపీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులు దానిని తీవ్రంగా పరిగణించాయి. క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత, పాస్టర్‌గా సేవలందిస్తూ కూడా ఎస్సీ చట్టాన్ని ఉపయోగించడం చట్టవిరుద్ధమని, ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని న్యాయస్థానాలు తేల్చిచెప్పాయి. క్రిస్టియన్లుగా మారిన వారికి ఎస్సీ అట్రాసిటీ చట్టం వర్తించదని, కుల ప్రాతిపదికన రక్షణ కోరే హక్కు వారు కోల్పోతారని కోర్టు స్పష్టం చేసింది.
……………………………………………………………………….
చట్టం అనేది నిజమైన బాధితులను కాపాడటానికి ఉండాలి తప్ప, మత మార్పిడులను ప్రోత్సహించడానికి లేదా అమాయకులను భయపెట్టడానికి ఆయుధంగా మారకూడదు. క్రైస్తవంలోకి వెళ్లామని చెబుతూనే, హిందూ సమాజంపై కక్ష తీర్చుకోవడానికి ఈ చట్టాన్ని కవచంగా వాడుకోవడం తప్పు. ఇటువంటి అక్రమ కేసులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
………………
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్క్రైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి అక్రమాలను, నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!




