………………………………………………
నమస్తే! యుద్ధభూమిలో గెలవలేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యానిమేషన్ల సహాయంతో డిజిటల్ యుద్ధంలో గెలిచినట్లు పాకిస్తాన్ నాటకాలు ఆడుతోందా? భారత్‌కు చెందిన ‘ఆపరేషన్ సిందూర్’ డాక్యుమెంటరీకి కౌంటర్‌గా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ విడుదల చేసిన వీడియో వెనుక ఉన్న అసలు నకిలీ ప్రచారం ఏమిటి? అసలైన సాక్ష్యాలు, శాటిలైట్ ఆధారాలు చూపించలేక గ్రాఫిక్స్‌తో ప్రపంచాన్ని మభ్యపెట్టాలని పాకిస్తాన్ ఎలా ప్రయత్నిస్తోంది? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
…………………………………………………………….
తాజాగా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ “ఫిజాఓన్ కే పసబాన్” పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది. భారత్‌తో జరిగిన ఆపరేషన్ సిందూర్ ఘర్షణలో తాము ఏకంగా 32 భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని వెల్లడించింది. మొత్తంగా రఫేల్, సుఖోయ్ వంటి 8 భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని ఆ వీడియోలో గొప్పలు చెప్పుకుంది. అయితే ఈ ప్రచారంలో అసలైన ఫోటోలు గానీ, శాటిలైట్ ఆధారాలు గానీ ఎక్కడా చూపించలేకపోయింది.
….
నిజమైన ఆధారాలు ఏవీ లేకపోవడంతో పాకిస్తాన్ పూర్తిగా ఏఐ ..యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వీడియోలపై ఆధారపడింది. భారత్ విడుదల చేసిన ఒరిజినల్ డాక్యుమెంటరీలో పాకిస్తాన్‌లోని విమానాలు, వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాలతో సహా స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం గ్రాఫిక్స్ ద్వారా పేలుళ్లను చూపిస్తూ నకిలీ విజయాన్ని ప్రచారం చేస్తూ అంతర్జాతీయంగా నవ్వులపాలవుతోంది.
……………………………………………………………………
సొంత ప్రజలను, ప్రపంచాన్ని నమ్మించడానికి నకిలీ యానిమేషన్లతో డిజిటల్ వార్ డ్రామాలు ఆడటం పాకిస్తాన్ శైలికి నిదర్శనం. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రధాని మోదీ స్వయంగా చెక్కుచెదరని ఎస్-400 వ్యవస్థ వద్ద ఫోటో దిగారు. వాస్తవానికి పాకిస్తాన్ అబద్ధాలను అప్పట్లోనే బట్టబయలు చేశాయి. యుద్ధంలో ఓడిపోయిన ప్రతిసారీ ఇలాంటి ఫేక్ వీడియోలతో కాలం వెళ్లదీయడం పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది.
……………………….
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్క్రైబ్ చేసుకోండి. మన సైనిక శక్తిని, పాకిస్తాన్ ఆడుతున్న నకిలీ డ్రామాల వెనుక ఉన్న నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!




