తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల పేరిట సాగిస్తున్న రాజకీయాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో ఏళ్లుగా జరుగుతున్న విద్యుత్ దొంగతనాలు, బిల్లుల ఎగవేతను అరికట్టాల్సింది పోయి వాటిని సీఎం రేవంత్ రెడ్డి సమర్థించడం కలకలం రేపింది. ఇటీవల నిర్వహించిన మైనారిటీ ఎక్సలెన్స్ సమిట్లో ఆయన మాట్లాడారు. పాతబస్తీ ప్రజలు విద్యుత్ దొంగతనాలు చేస్తారని అందరూ అంటుంటారని తెలిపారు. అయితే తమ ‘గృహ జ్యోతి’ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా ముస్లింలే అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని ఆయన గర్వంగా ప్రకటించారు. విద్యుత్ చౌర్యం బదులుగా ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పుకొని వచ్చారు.
…………………………………………………..
పాతబస్తీలో ఏటా సుమారు 20 లక్షల యూనిట్ల విద్యుత్ చౌర్యం జరుగుతోంది. దీనివల్ల విద్యుత్ సంస్థలకు ఏటా రూ. 511 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. తనిఖీలకు వెళ్లే అధికారులను బెదిరించడం అక్కడ నిత్యకృత్యంగా మారింది. చట్టవ్యతిరేక పనులను అరికట్టాల్సిన ప్రభుత్వం, ఉచిత విద్యుత్ పేరుతో అక్రమాలను ప్రోత్సహించడంపై జాతీయవాదులు మండిపడుతున్నారు. ఇది ప్రభుత్వ నిధుల దుర్వినియోగమేనని విమర్శిస్తున్నారు.
………………………………………………………………….
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒకే వర్గానికి అనుకూలంగా వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. “కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు ఉనికి ఉండదు” అని రేవంత్ రెడ్డి గతంలో బహిరంగంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి భారీగా రూ. 3,000 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను ఉమ్మడి ఉమ్మడి జాబితాలో సమర్థవంతంగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను విడుదల చేసింది. పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టును వేగవంతం చేస్తామని హామీ ఇచ్చింది. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో ప్రత్యేక సడలింపులు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటూ రేవంత్ రెడ్డి సగర్వంగా చెబుతూ ఉంటారు.
…………………………………………………………………………….
ఈ నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనం. చట్టం ముందు పౌరులందరూ సమానులేనన్న రాజ్యాంగ సూత్రానికి ఇది విరుద్ధం. లౌకికవాదం ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం మత ప్రాతిపదికన పక్షపాతం చూపుతోంది. నిజాయితీగా పన్నులు చెల్లించే పౌరులపై భారం మోపుతోంది. విద్యుత్ దొంగతనాలకు పాల్పడే వారికి ప్రజాధనంతో ఉచితాలు అందించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
…..
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం “సబ్కా సాథ్, సబ్కా వికాస్” సిద్ధాంతంతో పనిచేస్తోంది. కులమతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తోంది. కానీ తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సమాజంలో విభజన తెచ్చేందుకు యత్నిస్తోంది. ఏళ్ల తరబడి సాగుతున్న అక్రమాలను సమర్థించడం దేశ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు. చట్టపాలనను దెబ్బతీసే కాంగ్రెస్ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని జాతీయవాద విశ్లేషకులు భావిస్తున్నారు.



