……..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ..SIR ప్రక్రియలో తన ఓటును తొలగించారంటూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, స్థానిక ఎన్నికల ప్రక్రియను లక్ష్యంగా చేసుకుంటూ ఆయన సామాజిక మాధ్యమం ‘X’లో ఒక వీడియో పోస్ట్ చేశారు. తన పుట్టిన ఊరు, పోటీ చేసిన నియోజకవర్గంలోనే ఓటు హక్కును కాలరాశారంటూ రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు.
…..
ఈ ఆరోపణలపై బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను బయటపెట్టారు. ప్రకాష్ రాజ్ గత నాలుగేళ్లుగా తను నమోదు చేసుకున్న గార్డెన్ అపార్ట్మెంట్లోని పాత చిరునామాలో నివసించడం లేదని స్పష్టం చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్ నిర్వహించిన క్షేత్రస్థాయి విచారణలో పొరుగువారు, ప్రాపర్టీ మేనేజర్ మరియు ప్లాట్ యజమాని కూడా ఆయన అక్కడ ఉండటం లేదని ధ్రువీకరించారు.
నిబంధనల ప్రకారం, పాత చిరునామాలో ఉండటం లేదు కాబట్టి ఆయన ఓటు స్థితిని ‘షిఫ్టెడ్’ గా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పైగా అధికారులు స్వయంగా ప్రకాష్ రాజ్‌తో ఫోన్లో మాట్లాడగా, తాను ప్రస్తుతం శాంతినిగర్ నియోజకవర్గంలో నివసిస్తున్నట్లు ఆయనే ఒప్పుకున్నారు. నూతన చిరునామా ఆధారంగా ‘ఫారమ్-6’ సమర్పించి ఓటును పునరుద్ధరించుకోవచ్చని అధికారులు సూచించారు.
……
ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు, నకిలీ ఓట్లను తొలగించేందుకు మోదీ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో చట్టబద్ధమైన చర్యలు చేపడుతోంది. కొత్త వివరాలను ఉద్దేశ పూర్వకంగా దాచిపెట్టిన
ప్రకాష్ రాజ్.., ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలను, రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కొన్ని వామపక్ష, కమ్యూనిస్టు భావజాల శక్తులు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి అసత్య ప్రచారాలను నడుపుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
………
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. చట్టం ముందు సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ఒకటేననే సిద్ధాంతంతో ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తోంది. వామపక్ష శక్తుల తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ, దేశంలో పారదర్శక పాలన అందిస్తోంది. అయినా సరే.. తప్పుడు ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.



