
…………………………………………………………………………….
నమస్తే! అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీసేయటంలో కాంగ్రెస్ పార్టీ కి .. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తోడైంది. విదేశీ పర్యటనల్లో భారత్ మీద బురద చల్లటం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ కు అలవాటు. ఇప్పుడు త్రణమూల్ మరో అడుగు ముందుకు వేసింది. దేశ అంతర్గత అంశాలను త్రణమూల్ ఏకంగా ఐక్యరాజ్యసమితి వరకు తీసుకెళ్లింది. మత రంగు పూస్తూ టిఎంసి ఎంపీ మహువా మొయిత్రా చేసిన వివాదాస్పద ఫిర్యాదు, దాని వెనుక ఉన్న రాజకీయ కుట్రల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
……………………………………………
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటన సమయంలో కొంతమంది ఆఫీసర్స్ కు డ్యూటీ వేయలేదు. దీనికి త్రణమూల్ పార్టీ మతం రంగు పులిమింది. ముగ్గురు ముస్లిం అధికారులను కావాలనే డ్యూటీల తప్పించారంటూ త్రణమూల్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపించారు. వీరిని మతం ప్రాతిపదికన పక్కన పెట్టారంటూ ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ విభాగానికి ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి రాతపూర్వక ఆధారాలు కానీ, కనీస ఆధారాలు కానీ ఆమె చూపించలేకపోయారు.
…..
భద్రత, ప్రోటోకాల్, పరిపాలనా విధుల్లో భాగంగా జరిగే మార్పులకు మత రంగు పులిమటం చాలా దారుణం. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను అపకీర్తి పాలు చేయడమే లక్ష్యంగా ఈ డ్రామా ఆడారు. నిజానికి మన దేశీయ విచారణ వ్యవస్థలకు ఆమె ఎటువంటి ఫిర్యాదు చేయలేదు., పబ్లిక్ గా ఎటువంటి ఆధారాలను గానీ చూపలేదు. అంతర్జాతీయ వేదికలపై వికృత రాజకీయం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటు బ్యాంక్ కోసం ప్రభుత్వ అధికారులను మత ప్రాతిపదికన విడదీసేలా మాట్లాడటం చాలా చాలా దారుణం. జరిగింది ఒకటి అయితే, అంతర్జాతీయ సమాజానికి చూపిస్తున్నది మరొకటి. దీని కోసం కాంగ్రెస్, త్రణమూల్ పార్టీలు పోటీ పడుతున్నాయి.
…………………………………………………….
స్వార్థ రాజకీయాల కోసం దేశ ప్రతిష్టను దిగజార్చటం రాహుల్ గాంధీ కి అలవాటు. విదేశీ పర్యటనలలో ఆయన కావాలని కొన్ని మీటింగ్ లు ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో భారత్ లో మానవ హక్కులను మంట గలుపుతున్నారంటూ బురద చల్లేస్తారు. ఇప్పుడు ఈ పనిని .. త్రణమూల్ కాంగ్రెస్ తీసుకొందన్న మాట. స్వార్థ రాజకీయాల కోసం.. అంతర్జాతీయ వేదికలను వాడుకోవడం తీవ్రంగా ఖండించాల్సిన అంశం. భద్రతా ప్రోటోకాల్‌ను మత కోణంలో చూపిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రమాదకరం. ప్రతిదానికీ మత రంగు పులుముతూ దేశాన్ని తక్కువ చేయటాన్ని సహించకూడదు.
……….
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియ ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!




