—
నమస్తే! చవకబారు పబ్లిసిటీ కోసం కొందరు ఏ స్థాయికైనా దిగజారుతున్నారు. జాతీయవాద భావజాలంతో రాజకీయాల్లో రాణిస్తున్న మహిళా నాయకుల మీద బురద చల్లటం ఫ్యాషన్‌గా మారింది. బిజెపి ఎంపీ కంగనా రనౌత్, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరియు ప్రధాని మోదీలను ఉద్దేశించి డ్రామా క్వీన్ రాఖీ సావంత్ నీచమైన కామెంట్స్ చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు మరియు దీనిపై కంగనా రనౌత్ ఇచ్చిన ఘాటైన సమాధానం ఇప్పుడు చూద్దాం.
………………………………………………..
ఒక టాక్ షోలో పాల్గొన్న రాఖీ సావంత్ …బిజెపి మహిళా నాయకులు కంగనా రనౌత్, స్మృతి ఇరానీ మీద అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి వారు ఏదో ఇచ్చారని, అందుకే వారికి పదవులు ఇచ్చారంటూ నీచమైన ఆరోపణలు గుప్పించారు. ఇంకా దారుణం ఏమిటంటే.. కొన్ని అసభ్యకరమైన సంకేతాలు కూడా రాఖీ సావంత్ చూపించారు. చీప్ పబ్లిసిటీ కోసం మహిళల గౌరవాన్ని కించ పరచటం అన్యాయమే అవుతుంది. కష్టపడి పైకొచ్చిన మహిళా నాయకుల క్యారెక్టర్‌ను దిగజార్చేలా మాట్లాడటం ముమ్మాటికీ తప్పే.
………..
ఈ వివాదంపై ఎంపీ కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఓటమిపాలై నిరాశలో ఉన్నవారే ఇలా తక్కువ చేసి మాట్లాడతారని తీవ్రంగా మండిపడ్డారు. నీలాంటి వారికి కనీసం ఊడ్చే ఉద్యోగం కూడా దక్కదని రాఖీ మీద నిప్పులు కురిపించారు. ఏ ప్రతిభ లేనివారు మాత్రమే ఇతరులపై బురద జల్లుతారంటూ చెంపదెబ్బ లాంటి కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి రాఖీ సావంత్ గత చరిత్ర చూస్తే, ఈ విషయం అర్థం అవుతుంది. పబ్లిసిటీ కోసం దారుణమైన కామెంట్స్ చేయటం ఆమెకు మొదట నుంచీ అలవాటు. ఇదే విషయం మరోసారి బయట పడింది………………………………………………………
పబ్లిసిటీ కోసం జాతీయవాద మహిళా నాయకులపై ఇటువంటి నీచమైన కామెంట్స్ చేయడం చాలా తప్పు. సమాజంలో స్వయంకృషితో ఎదిగిన మహిళలను ప్రోత్సహించాల్సింది పోయి, ఇలా కష్టపెట్టడం దారుణం. ఇటువంటి కామెంట్స్ చేసే వారి మీద అర్జంట్ గా కేసులు నమోదు చేయాలి. అరెస్టు చేసి, జైలుకి పంపిస్తే, మిగిలిన వాళ్లకు బుద్ది వస్తుంది అని పరిశీలకులు అంటున్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే మేధావులు ఇలాంటి కామెంట్స్ మీద సైలంట్ అవ్వటం మరీ విచిత్రం.
………………………
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!




