……………………………………………………………………..
రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని (మెడికో) ప్రియాంకను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ పాశవిక చర్యకు పాల్పడిన నిందితులు సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్లను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ కేసులో రెండో నిందితుడైన ఎడ్వర్డ్ వెనుక బలీయమైన మత శక్తి అండగా నిలవడం ఇప్పుడు పలు అనుమానాలకు, తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది.
………
నిందితుడు ఎడ్వర్డ్ తండ్రి ఒక ప్రముఖ చర్చికి పాస్టర్ కావడంతో, ఈ కేసు నుంచి అతడిని రక్షించేందుకు రాష్ట్రాలోని పెద్ద పెద్ద చర్చిల నిర్వాహకులు, పలువురు పాస్టర్లు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చట్టాన్ని తమ గుప్పెట్లోకి తీసుకుని, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తూ కేసును తారుమారు చేసేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నారు. ఒక అమాయక యువతి ప్రాణం పోయినా కనీస మానవత్వం లేకుండా, కేవలం తమ పాస్టర్ కొడుకును కాపాడుకోవడమే ధ్యేయంగా చర్చి పెద్దలు వ్యవహరిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
…………………………………
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా మత మార్పిడుల పేరిట కొన్ని చర్చిలు, పాస్టర్లు కోట్ల రూపాయల విదేశీ నిధులను, అక్రమ సంపాదనను కూడబెట్టారనే విమర్శలు బలంగా ఉన్నాయి. దేవుని సేవ పేరిట ప్రజలను మభ్యపెట్టి ఆర్జించిన ఈ అపరిమితమైన డబ్బునే ఇప్పుడు తమ పిల్లలు చేసే దారుణాలు, చెత్త పనులను కప్పిపుచ్చుకోవడానికి అస్త్రంగా వాడుతున్నారు. పోలీసు వ్యవస్థను, సాక్ష్యాలను డబ్బు సంచులు, రాజకీయ ప్రభావంతో కొనుగోలు చేసేందుకు ఈ చర్చి సామ్రాజ్యాలు తెగబడుతున్నాయనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.
………………………………
గతంలో కూడా చర్చిలు చాలా అరాచకాలకు పాల్పడ్డాయి. పాస్టర్ లు చేసిన నేరాలు, ఘోరాలను డబ్బులు ఖర్చు పెట్టి రాజీ చేసుకొంటూ వస్తున్నారు. ఇప్పుడు పాస్టర్ లే కాదు, పాస్టర్ ల కొడుకుల నేరాలకు కూడా డబ్బులు వెదజల్లుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
విశ్వాసకుల నుంచి సేకరించిన నిధులను, మత మార్పిడుల ద్వారా వచ్చిన సొమ్మును నేరస్థులను రక్షించడానికి ఖర్చు చేయడం చర్చిలు చేస్తున్న దారుణమైన ఆధ్యాత్మిక, సామాజిక మోసాలలో ఒకటి. దీనిని బట్టి చర్చి పాస్టర్ ల నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు.
…………………………….
ధర్మం, న్యాయం అందరికీ ఒక్కటేనని, నిందితులకు మతపరమైన రక్షణ లభించకూడదని స్థానికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. రాజమహేంద్రవరం మెడికో ప్రియాంక హత్య కేసులో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, చర్చిల దండయాత్రను తిప్పికొడుతూ పోలీసులు నిష్పాక్షికంగా విచారణ జరపాలి. హత్యకు పాల్పడిన దస్వంత్, ఎడ్వర్డ్లతో పాటు, కేసును తారుమారు చేసేందుకు యత్నిస్తున్న ఆ చర్చి పాస్టర్ల కుట్రలను కూడా బయటపెట్టాలి. అసలైన నిందితులను కఠినంగా శిక్షించినప్పుడే బాధితురాలి ఆత్మకు, సమాజానికి న్యాయం జరుగుతుంది.



