……………………………………………………………………..
నమస్తే! తుపాకీ గొట్టం ద్వారా భయాన్ని వ్యాప్తి చేస్తూ, సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే నక్సలిజం మూలాలు దెబ్బతింటున్నాయి. ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా ఉండి, పండుగలు చేసుకోవడానికి కూడా భయపడిన గ్రామాలలో ఈరోజు వినాయక నవరాత్రుల సందడి నెలకొంది! భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ దెబ్బకు నక్సలైట్లు పారిపోవడంతో, ధర్మారం గ్రామంలో హిందూ పండుగలు చేసుకొంటున్నారు. సమాజాన్ని నక్సలిజం చీకట్ల నుంచి శాంతి, భక్తి వైపు నడిపిస్తున్న ఈ అద్భుతమైన మార్పు గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
……………………………………………….
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని ధర్మారం గ్రామం ఏడాది క్రితం వరకు మావోయిస్టుల కరడుగట్టిన ప్రభావంలో ఉండేది. ఏకంగా 700 మంది మావోయిస్టులతో కలసి పోలీసు బేస్ క్యాంప్‌పై దాడి చేసిన భయానక చరిత్ర ఆ ఊరికి ఉంది. నిత్యం భయం గుప్పిట్లో బతికిన ప్రజలు గడప దాటి బయటకు రావడానికే వణికిపోయేవారు. హిందూ పండుగలు, వేడుకలు చేసుకోవడానికి కూడా మావోయిస్టులు తీవ్రంగా అడ్డంకులు సృష్టించేవారు.
….
అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ తో ధర్మారం రూపురేఖలు మారిపోయాయి. మావోయిస్టుల భయం వీడటంతో, గ్రామానికి విద్యుత్, రహదారి సౌకర్యాలు వచ్చాయి. ఇప్పుడు ఊరి ప్రజలంతా ఒక్కటై గణపతి మండపాన్ని ఏర్పాటు చేసుకుని …. చవితి వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితి మండపం గ్రామంలో ఐకమత్యాన్ని, సౌబ్రాతృత్వాన్ని నింపింది. ఇప్పుడు తామంతా కలిసికట్టుగా పండుగ చేసుకోవడంపై విపరీతమైన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
…………………………………………………………………………
నక్సలిజం మరియు మావోయిజం అనేది కేవలం విధ్వంసానికి, అభివృద్ధి నిరోధకతకు సంకేతం. మన హిందూ పండుగలు, వినాయక చవితి మండపాలు కేవలం భక్తికి మాత్రమే కాదు.. కులమతాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేయడానికి, ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందించడానికి ప్రతీకలు. భయం పోయి భక్తి, ఐకమత్యం పెరిగిన ఈ సంఘటన హిందూ సంస్కృతి గొప్పతనానికి, నక్సలిజంపై సాధించిన విజయానికి నిదర్శనం.
…………………………………………………………..
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!



