నమస్తే!
హిందువుల పవిత్రమైన నమ్మకాలను, పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ క్రమపద్ధతిలో కుట్రలు పన్నుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చి అబద్ధాలను, ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నారు. అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సీఈఓ జితేంద్ర మిశ్రాపై కాంగ్రెస్ మరోసారి తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ తప్పుడు ప్రచారం వెనుక ఉన్న నిజాలు, దాని వెనుక ఉన్న కుట్రల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
…………………………………………….
అయోధ్య రాముడి ఆలయ నిర్మాణం, నిధుల వినియోగంపై ఇప్పటికే కాంగ్రెస్ బోలెడు బురద చల్లేసింది. అయోధ్య పరువు తగ్గించటమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రష్మి తప్పుడు ప్రచారానికి తెర తీశారు. రామ్ మందిర్ సీఈఓ జితేంద్ర మిశ్రా అవినీతికి పాల్పడ్డారని, పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆమె అంటున్నారు. ఈ ప్రచారాన్ని సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ చేస్తున్నారు. రామ మందిరం మీద, రాముడి మీద… భక్తుల్లో అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నించారు.
…..
వాస్తవానికి ట్రస్ట్ సీ ఈ వో గా జితేంద్ర మిశ్రా మొన్న మొన్ననే ఛార్జీ తీసుకొన్నారు. ఈ 4 రోజుల్లోనే నిధుల గోల్ మాల్ అయ్యేందుకు ఛాన్సే లేదు. పైగా ఎయిర్ ఫోర్స్ లో దేశ రక్షణ కోసం అద్భుతమైన సేవలు అందించారు. నిప్పులాంటి ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. నిజానికి, ఈ వార్తల్ని పరిశీలిస్తే.. ఈ వ్యవహారం మొత్తం పచ్చి అబద్ధమని తేలింది. జితేంద్ర మిశ్రాపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా కల్పితమని స్పష్టమైంది. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీయడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి కాంగ్రెస్ .. ఈ బురద చల్లుతోందన్న మాట.
……………………………………………………………………
పవిత్రమైన ధార్మిక క్షేత్రాలపై, హిందూ విశ్వాసాలపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం చాలా చాలా తప్పు. అబద్ధాలను నిజాలుగా నమ్మించి సమాజంలో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. రామ మందిరం మీద చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారాన్ని ప్రజలంతా గుర్తించాలి. ధర్మాన్ని, నిజాలను రక్షించుకోవడానికి ఇలాంటి అబద్ధపు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి.
…………
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!




