………………………………………………………………
సాధారణంగా ‘లవ్ జిహాద్’ పేరిట అమాయక యువతులను ప్రేమ వలలో దించి, లొంగదీసుకొని, మతం మార్చి ప్రాణాలు తీసే ఘటనలను ఇప్పటివరకు చూశాం. కానీ, దానికి మించిన అత్యంత వికృత రూపం కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. కేవలం ఒక అమ్మాయిని లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా, ఆమె భర్తను హతమార్చి, చివరికి ఆ కుటుంబాన్ని మొత్తంగా వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన సంచలనాత్మక ఉదంతం ఇది. ఈ ఘటన సమాజంలో పెరిగిపోతున్న ఇటువంటి ముప్పు పట్ల ప్రతి ఒక్కరూ ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తోంది.
పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం వెనుక ఉన్న అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రో షూటింగ్ అకాడమీ నిర్వాహకుడు షేక్ సాధిక్ ఖాన్ సాగించిన అమానుష వేధింపులే ఈ దారుణానికి ప్రధాన కారణమని తేలింది. నూకరాజు కుమార్తె సౌజన్య భర్త జగదీశ్ రెడ్డి ఈ ఏడాది జులై 2న అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, అతడికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాధిక్ ఖానే హత్య చేశాడని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది.
జగదీశ్ రెడ్డి మరణం తర్వాత సహాయం చేస్తానని నమ్మబలికిన సాధిక్, ఆ తర్వాత తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. సౌజన్యను తీవ్రంగా బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తూ ఆస్తి, ఫోన్, బ్యాంక్ ఖాతాలు, ఎస్బీఐ లాకర్ వివరాలను బలవంతంగా లాక్కున్నాడు. అంతేకాకుండా, ఆమెను మతం మారాలని తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. దీనికి అంగీకరించకపోతే కుటుంబం మొత్తాన్ని, చిన్నారిని సైతం చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక మహిళపై సాధిక్ చూపిన ఈ రాక్షసత్వం లవ్ జిహాద్ పేరిట సాగే మానసిక, శారీరక వేధింపులకు పరాకాష్ట.
రాక్షస వేధింపులను తట్టుకోలేక ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డితో కలిసి రాజమహేంద్రవరం వద్ద గోదావరిలోకి దూకారు. ఆ భయంకర స్థితిలోనూ మనవడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడగా, నూకరాజు మృతదేహం లభ్యమైంది. చనిపోయే ముందు నూకరాజు రాసిన లేఖలోనూ, సౌజన్య బైక్‌లో లభించిన లేఖలోనూ సాధిక్ చేసిన మోసాలు, భర్త హత్యకు సంబంధించిన అనుమానాలు, బలవంతపు మతమార్పిడి ఒత్తిళ్ల గురించిన వివరాలు స్పష్టంగా వెల్లడయ్యాయి.
లవ్ జిహాద్ అనేది కేవలం ప్రేమ మోసం మాత్రమే కాదని, ఒక నిండు కుటుంబాన్ని పక్కా పథకం ప్రకారం సర్వనాశనం చేసే సామాజిక మహమ్మారి అని ఈ ఘటన నిరూపిస్తోంది. అమాయకులను ఆసరాగా చేసుకుని ఆస్తులు కాజేయడం, మత మార్పిడులకు ఒత్తిడి చేయడం, ఎదిరిస్తే హత్యలకు పాల్పడటం వంటి ఆగడాల పట్ల సమాజం తీవ్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. నిందితుడు ఎంతటివారైనా సరే, ఇటువంటి ఉన్మాదులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



