అది రాజకీయం అంచనా వేయలేని ఒక నిశ్శబ్ద యుద్ధం. ఆయుధాలు లేకుండా, సరిహద్దులతో సంబంధం లేకుండా, దేశ భవిష్యత్తు అయిన యువతనే కేడర్‌గా మార్చుకుని నడిపిన ఒక మహా కుట్ర. ప్రజాస్వామ్య బరిలో నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని ఎదుర్కోలేక ఓడిపోయిన శక్తులు, ఈసారి దేశ గుండెకాయ లాంటి విద్యా వ్యవస్థను ఎంచుకున్నాయి. కోట్ల మంది విద్యార్థుల కలలను, వారి శ్రమను పణంగా పెట్టి… ఢిల్లీ పీఠాన్ని కదిలించేందుకు నాలుగైదు నెలల క్రితమే ఈ శకుని వ్యూహానికి బీజం పడింది. దేశంలో అలజడి రేపేందుకే.. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు… భయంకరమైన నిజం బయట పడింది.
…….
తెర ముందేమో పరీక్షల ఆందోళనలు, తెర వెనుకేమో అంతర్జాతీయ నిధుల సునామీ! విదేశాల నుంచి అక్రమంగా వచ్చి పడిన కోట్ల రూపాయల ధనప్రవాహం.. సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని అల్లకల్లోలం చేసింది. నకిలీ ఖాతాలు, పెయిడ్ ప్లాట్‌ఫామ్‌లు, రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన డిజిటల్ దళాలు… విద్యార్థుల ఆక్రందనలను ఆసరాగా చేసుకుని దేశంలో ఆగ్రహజ్వాలలు రగిలించేలా ప్రతి అడుగును పక్కాగా స్కెచ్ వేశారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో సాగిన ఈ డిజిటల్ నాటకం వెనుక ఉన్నది కేవలం పరీక్ష పేపర్ల లీకేజీ మాత్రమే కాదు, దేశాన్ని వీధి పోరాటాల వైపు నెట్టి అరాచకం సృష్టించాలనే భయానక దురాలోచన!
……
లక్షలాది మంది విద్యార్థుల ఆశలను బాంబుగా మార్చి, దేశ రాజధాని వీధుల్లో అల్లర్లు రేపి, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని బద్ధలు కొట్టాలన్నది ఈ కుట్రదారుల అంతిమ లక్ష్యం.
ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలవలేక, ప్రజల తీర్పును అంగీకరించలేక… అశాంతి అనే మంటలు రాజేసి, ఆ పొగలో తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూశారు. యువత నరనరాల్లో నిరాశను, క్రోధాన్ని నూరిపోసి, దేశాన్ని ఒక రణరంగంగా మార్చడమే ఈ నాటకంలో అసలు ఘట్టం.
అయితే, ఈ ఛాయా యుద్ధాన్ని కేంద్ర ప్రభుత్వం అంతే చాకచక్యంగా తిప్పికొట్టింది. కుట్రదారుల ముసుగులను చీల్చి చెండాడేందుకు సీబీఐ ఈ దర్యాప్తు అప్పగించింది. సిబిఐ దర్యాప్తులో కళ్లు చెదిరే నిజాలు బయట పడుతున్నాయి. సమాజంలో అలజడి కోసమే నీట్ పరీక్ష పేపర్లు లీక్ చేశారు. దీని కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇక, ఈ కుట్రలకు అడ్డుకునేందుకు కేంద్రం ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చింది. నిజాయితీగా చదివే ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు మోదీ ప్రభుత్వం రక్షణ కవచంలా నిలిచింది. కఠినమైన చట్టాలు, పారదర్శక దర్యాప్తులతో ఈ మహా కుట్రలను నరికివేస్తోంది. దేశాన్ని అస్థిరపరచాలని చూసిన నల్ల శక్తుల కుతంత్రాలు తిప్పికొడుతూ… దేశ ప్రగతికి మరియు యువత భవిష్యత్తుకు మోదీ ప్రభుత్వం కొండంత అండగా నిలబడింది.



