………………………………………….
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థలోని సంస్కరణల కంటే కొందరు నాయకులకు తమ రాజకీయ స్వార్థమే ముఖ్యం అయిపోయిందా? జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనలు నిజంగా విద్యార్థుల మేలు కోసమేనా, లేక ప్రతిపక్షాలకు మైలేజ్ ఇచ్చే రాజకీయ కుట్రలా? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టడం వెనుక ఉన్న అసలు మర్మం ఏంటి? చిన్న విషయాన్ని పక్కన పెట్టి, కేవలం రాజీనామా డిమాండ్ చుట్టూ నాటకం ఆడటం వెనుక ఎవరి లాభం దాగి ఉంది?
…………………………………………………………….
విద్యార్థుల ఆందోళన లో సింగిల్ పాయింట్ అజెండా ఒకటే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇదే ప్రధానమైన డిమ3ాండ్. నిజానికి . ధర్మేంద్ర ప్రధాన్ ని మంత్రి పదవి నుంచి తప్పించినంత మాత్రాన వ్యవస్థ మారిపోదు, బీజేపీ కి చెందిన మరో నాయకుడే ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. అధికారులు, వ్యవస్థ అలాగే ఉంటాయి. మరి ఏమి అద్భుతాలు జరిగిపోతాయని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కు పట్టుపడుతున్నారు. పరిష్కారాల గురించి చర్చించకుండా కేవలం వ్యక్తుల రాజీనామాలపైనే ధర్నాలు చేయడం తీవ్రమైన హైడ్రామాకు నిదర్శనం.
………
కానీ ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థుల ఆవేదనను, నిరసనలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నాయి. సమస్యలను చట్టసభల్లో చర్చించి, పరిష్కారాలు సూచించాల్సిన ప్రతిపక్షాలు… వీధుల్లో డ్రామాలు చేస్తూ దేశంలో అస్థిరతను సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు పట్ల, విద్యా ప్రమాణాల పెంపు పట్ల మోదీ ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తోంది. ఈ తరహా ‘డ్రామా రాజకీయాలను’ ప్రజలు, విద్యార్థులు ఇప్పటికే స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు.
…………………………………………………………..
మిత్రులారా… దేశంలో వ్యవస్థాగత మార్పులు రావాలంటే ప్రభుత్వానికి సహకరిస్తూ, నిజమైన సంస్కరణలకు మద్దతు ఇవ్వాలి తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం ఆడే ఇలాంటి నాటకాలకు లోనుకాకూడదు. దేశ ప్రయోజనాల కంటే తమ పార్టీ స్వార్థమే ముఖ్యమనుకునే శక్తుల నైజాన్ని మనం గమనించాలి. మోదీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
……………………………………………………
దేశంలో జరుగుతున్న రాజకీయ కుట్రలను బట్టబయలు చేస్తూ, జాతీయవాద భావాలను నిరంతరం మీ ముందుకు తెస్తున్న మన ‘మై ఇండ్ మీడియా ఛానెల్‌ను ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, అందరికీ చేరేలా వెంటనే షేర్ చేయండి. ధన్యవాదాలు, జై హింద్, జై భారత్!



