……….
లక్షలాది మంది విద్యార్థులు రాత్రి పగలూ.. కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే.. కొందరు నేతలు అడ్డగోలుగా రాజకీయాలు చేస్తున్నారు.
నీట్ అక్రమాలపై పోరాటం పేరుతో కొందరు రాజకీయ నాయకులు ప్రదర్శిస్తున్న నాటకాలను మీరు గమనిస్తున్నారా? విద్యార్థుల ఆవేదనను, వారి కష్టాన్ని కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం వాడుకోవడం ఎంతవరకు న్యాయం? నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డున పడితే వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి… ప్రధాని నివాసం ముట్టడి అంటూ మీడియా మైలేజ్ కోసం డ్రామాలు ఆడటం సరైనదేనా? అసలు విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయ నాయకులకు వారి స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమైపోయాయా?
………………………
రాహుల్ గాంధీ నీట్ అక్రమాలకు నిరసనగా ప్రధాని మోదీ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఆకస్మికంగా ప్రధాని నివాసాన్ని వందల మందితో ముట్టడిస్తే అరెస్టు చేస్తారు అని ఆయనకు బాగా తెలుసు. రాత్రి సమయంలో పోలీసులకు మరో ఆప్షన్ ఉండదు. అయినా సరే, ఈ మార్గం ఎంచుకున్నారు అంటేనే .. ఇది డ్రామా అని అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీ వీధుల్లో విపక్ష నేతగా ఆయన చేపట్టిన ఈ ఆందోళన వెనుక విద్యార్థుల ప్రయోజనాల కంటే రాజకీయమే ఎక్కువ. విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి పార్లమెంట్లో సీరియస్‌గా చర్చించాల్సిన ప్రతిపక్షం… వీధుల్లో డ్రామాలు చేస్తూ, రాజకీయం చేయడం విద్యార్థులను మోసం చేయడమే అవుతుంది.
……
ప్రభుత్వం ఇప్పటికే నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం సీబీఐ విచారణకు ఆదేశించింది . విద్యా శాఖలో సంస్కరణలు ప్రారంభించింది. అయినప్పటికీ, విపక్షాలు సమస్యకు పరిష్కారం వెతికే దిశగా సహకరించటం లేదు., విద్యార్థుల ఆగ్రహాన్ని ఇంధనంగా వాడుకుని ప్రభుత్వాన్ని బద్నాం
చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వందల సంఖ్యలో పేపర్ లీకేజ్ జరిగాయి కదా.
……………………
మిత్రులారా… దేశంలో ప్రతిష్ఠాత్మక పరీక్షలు రాసే విద్యార్థులకు కావాల్సింది న్యాయం.. అంతేగానీ నాయకులు తమ ఫొటోలు, వీడియోల పబ్లిసిటీ కోసం ఆడే రాజకీయ నాటకాలు కాదు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ తరహా రాజకీయ కుట్రలను గుర్తించి, నిజాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తు అయిన యువతను రాజకీయాల కోసం వాడుకునే శక్తులకు మనం ఎప్పటికీ మద్దతు ఇవ్వకూడదు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
……
దేశంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, రాజకీయ కుట్రల వెనుక ఉన్న సత్యాలను మీకు అందిస్తున్న మన ‘మై ఇండ్ మీడియా’ ఛానెల్‌ను ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు, జై హింద్!



