…………………………………………..
సోమవారం నాడు ఢిల్లీ వీధుల్లో విద్యార్థుల పేరుతో జరిగిన ఆందోళనల వెనుక ఒక పక్కా వ్యూహాత్మక కుట్ర దాగి ఉంది. అమాయక విద్యార్థుల భవిష్యత్తును బలిపశువు చేస్తూ “కాక్రోచ్ జనతా పార్టీ” అనే అరాచక బృందం దేశంలో విద్వేషం రాజేస్తోంది. కేవలం రాజకీయం కోసం విద్యార్థుల ను వాడుకుంటూ దేశ రాజధానిలో తీవ్ర అశాంతికి తెరలేపింది. ప్రజాస్వామ్యం పేరిట ఈ బృందం చేస్తున్న అరాచకాల పట్ల ప్రజలందరూ తీవ్రంగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
సామాజిక మాధ్యమాల్లో వ్యాపించిన ఈ “కాక్రోచ్ జనతా పార్టీ” అతితక్కువ కాలంలోనే ఒక వినాశకరమైన సాధనంగా మారింది. తెరవెనుక ఉండే అర్బన్ నక్సలైట్స్… కొందరు విద్యార్థులకు ఆశలు చూపి రోడ్లపైకి నెడుతున్నారు. తాము మాత్రం వెనుక దాక్కుని యువతతో చట్టవ్యతిరేక పనులు చేయిస్తున్నారు. నిరసనల ముసుగులో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేయడమే ఈ ముఠా అసలు నైజం.
ఈ అరాచక సమూహానికి విదేశాల నుంచి వందల కోట్లు వచ్చిపడుతున్నాయి. సోషల్ మీడియా లో పెయిడ్ ప్రమోషన్స్ పెట్టి, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. స్టూడెంట్స్ మొబైల్ ఫోన్స్ ను టార్గెట్ చేసుకొని, విపరీతంగా నెగటివ్ కంటెంట్ ను పంపింగ్ చేస్తున్నారు. అతితక్కువ సమయంలోనే ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడానికి కోట్లాది రూపాయల నిధులు సమీకరించారు. విదేశీ నిధుల నెట్వర్క్ల మద్దతుతోనే ఈ బృందం రాజధానిలో రచ్చ సృష్టిస్తోందని స్పష్టమవుతోంది. దేశంలో అస్థిరతను కోరుకునే శక్తుల చేతిలో ఈ పార్టీ ఒక పావుగా మారింది.
విదేశీ ఫండ్స్ సాయంతో ఈ బ్యాచ్ రెచ్చిపోయింది. పార్లమెంటు సమావేశాలను అడ్డుకొనేందుకు ప్రతిపక్షాలు కూడా చేతులు కలిపాయి. విద్యా వ్యవస్థను మరియు శాంతిభద్రతలను నాశనం చేయడమే లక్ష్యంగా ఈ నెట్వర్క్ కుట్రలు పన్నుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే, విదేశీ మీడియా దీనిని బాగా హైలెట్ చేస్తోంది. భారతదేశంలో విద్యార్థులు, ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. దీనిని బట్టి దీని వెనుక ఉన్న భారీ నెట్ వర్క్ గురించి అంచనా వేయవచ్చు.



