……………………………………..
సాఫ్ట్వేర్ కంపెనీ అనగానే మనకు వెంటనే వెస్ట్రన్ కల్చర్, పబ్‌లు, కేఫ్‌లు గుర్తుకొస్తాయి కదా? కోట్లు సంపాదించే బిలియనీర్లు అంటే విదేశీ సంస్కృతిని నెత్తిన మోస్తారనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, భారతీయ మూలాలను, మన వైదిక సంస్కృతిని గుండెల్లో పదిలంగా దాచుకుంటూ… ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఒక గ్లోబల్ ఐటీ కంపెనీ ఉందంటే మీరు నమ్మగలరా? ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో జాతీయవాదాన్ని, సంప్రదాయాలను చేతల్లో చూపిస్తున్న ఆ గొప్ప ఐటీ దిగ్గజం ఎవరు? రూ. వందల కోట్ల టర్నోవర్ సాధిస్తూ కూడా భారతీయతను సగర్వంగా చాటుతున్న ఆ మరాఠీ వ్యాపారవేత్త స్ఫూర్తిదాయక కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
………………………………………………………………………
ఇప్పుడు ‘పెర్సిస్టెంట్ సిస్టమ్స్’ ఫౌండర్ ఆనంద్ దేశ్‌పాండే గురించి తెలుసుకొందాం. ఇటీవల బిలియనీర్ల జాబితాలోకి చేరిన ఆయన… అంతర్జాతీయ స్థాయిలో 18 దేశాల్లో 53 ఆఫీసులతో ఐటీ రంగాన్ని ఏలుతున్నారు. కానీ ఆయన వ్యాపార శైలి మాత్రం పూర్తిగా మన హిందూ సంప్రదాయాలకే ప్రాధాన్యమిస్తుంది. విదేశీ కంపెనీల కల్చర్‌కు భిన్నంగా, పెర్సిస్టెంట్ కొత్త ఆఫీసుల్లోకి అడుగుపెట్టే ముందు శాస్త్రోక్తంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని, సంప్రదాయ పద్ధతిలోనే ‘గృహప్రవేశం’ చేస్తారు. అంతేకాదు, పూణే హింజవాడిలోని ఆఫీస్ టవర్లకు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణవేద అని వేదాల పేర్లు పెట్టుకొన్నారు. మరికొన్ని బిల్డింగులకు పింగళ, ఆర్యభట్ట, భగీరథ వంటి మన పురాతన మహర్షులు, శాస్త్రవేత్తల పేర్లు పెట్టడం విశేషం.
…….
పాశ్చాత్య సంస్కృతిని పక్కనపెట్టి మన పండుగలకు ఈ కంపెనీ పెద్దపీట వేస్తుంది. జనవరి 1న న్యూ ఇయర్ సెలవు ఇవ్వకపోయినా, మన యుగాది కి తప్పకుండా సెలవు ఇస్తారు. గణేష్ చతుర్థి, నిమజ్జనం రోజుల్లో పూజలు బ్రహ్మాండంగా చేసుకొంటారు.. ఆఫీసు లోపల గోడలపై వేదాల శ్లోకాలు, సూక్తులు దర్శనమిస్తాయి. మహిళా ఉద్యోగులు హల్దీ-కుంకుమ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15,000 మంది సిబ్బందిని ఉద్యోగులుగా కాకుండా ‘పెర్సిస్టెంట్ కుటుంబ సభ్యులు’గా చూస్తారు. “సింపుల్ లివింగ్… హై థింకింగ్” అని నమ్మే ఆనంద్ దేశ్‌పాండే గారు మన రతన్ టాటా గారి లాగే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
………………………………………………………………………….
మన సంస్కృతి, సాంప్రదాయాలు పాటించడం వల్ల వ్యాపారం వెనుకబడిపోతుందనేది ఎంతటి అబద్ధమో పెర్సిస్టెంట్ విజయాన్నే చూస్తే అర్థమవుతుంది. సంప్రదాయాలను గౌరవిస్తూనే, గత త్రైమాసికంలో ఏకంగా 1,490 కోట్ల ఆదాయం సాధించి ఐటీ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతోంది. “భారతీయ సంస్కృతి గొప్పది” అని కేవలం మాటలతో కాకుండా, చేతల్లో చూపించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని ఈ కంపెనీ నిరూపించింది. పాశ్చాత్య ధోరణిలో కొట్టుకుపోతున్న నేటి కార్పొరేట్ రంగానికి పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఒక గొప్ప ఆదర్శం, మన దేశానికే గర్వకారణం.
…….
పాశ్చాత్య సంస్కృతిని కాదని, భారతీయ మూలాలను కాపాడుకుంటున్న ఈ కంపెనీ తీరుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మన ధర్మాన్ని, సంస్కృతిని, భారతీయ జాతీయవాదాన్ని సగర్వంగా అందరికీ వినిపిస్తున్న మన ‘మై ఇండ్ మీడియా’ యూట్యూబ్ ఛానెల్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేయండి. సమాజంలో మన సంస్కృతి పట్ల గర్వాన్ని నింపే ఈ ప్రత్యేక విశ్లేషణను మీ మిత్రులందరికీ, కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.



