……………………………………………………………
అక్టోబర్ 2 న దేశ వ్యాప్తంగా గాంధీ జయంతిని పాటిస్తారు. గాంధీ జీవితం , విధానల గురించి గుర్తు చేసుకొంటారు. అహింస, సత్యాగ్రాహం, స్వాతంత్ర పోరాటం వంటి అంశాలను తప్పకుండా చర్చించాలి. అదే సమయంలో ముస్లింల కోసం దేశాన్ని పణంగా పెట్టడం మీద విమర్శలు ఉన్నాయి. గాంధీజీ జీవితంలోని టాప్ టెన్ వివాదాలు ఇప్పుడు చూద్దాం…
1. ఖిలాఫత్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు
1920 సమయంలో తుర్కీ ముస్లిం చక్రవర్తి కోసం భారత్ లోని ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమం చేశారు. దీనికి గాంధీజీ పూర్తి మద్దతు ఇచ్చారు. ముస్లింలకు అండగా నిలవాలన్న గాంధీ విధానం.. తర్వాత కాలంలో కాంగ్రెస్ ను మైనార్టీ రాజకీయాల వైపు మళ్లించింది. చివరకు
ముస్లింల ప్రత్యేక డిమాండ్లకు మరియు దేశ విభజనకు బీజం వేసింది.
2. మోప్లా ముస్లింల దాడులపై గాంధీ మౌనం
1921లో కేరళలోని మలబార్ ప్రాంతంలో ‘మోప్లా’ ముస్లింలు.. వేలాది మంది హిందువులను దారుణంగా హత్య చేశారు. పెద్ద ఎత్తున హిందువుల ఆస్తులను టార్గెట్ చేసి, ధ్వంసం చేశారు. ఈ మారణకాండను గాంధీజీ ఏమాత్రం ఖండించలేదు, పైగా ముస్లిం అల్లర మూకలను “ధైర్యవంతులైన, దేవునికి భయపడే ప్రజలు” అని ప్రశంసించారు. ఎన్ని దారుణాలు చేసినా.. ముస్లింలను ఏమీ అనకూడదనే ఆయన ధోరణి దీని ద్వారా స్పష్టమైంది.
3. భగత్ సింగ్ ఉరిశిక్షను ఆపకపోవడం
భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షను రద్దు చేయించేందుకు గాంధీజీ తన వద్ద ఉన్న పూర్తి రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించలేదు. గాంధీ-ఇర్విన్ ఒప్పందం సమయంలో ఈ ఉరిశిక్ష రద్దును నిబంధనగా పెట్టలేదు. విప్లవకారులను కాపాడటానికి నిరాకరించిన గాంధీజీ, ముస్లింల హింసాత్మక ఉద్యమాలకు మాత్రం మద్దతుగా నిలిచారు.
4. సుభాష్ చంద్రబోస్ ను కాంగ్రెస్ నుంచి పంపేయడం
1939లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీజీ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ఓడించి సుభాష్ చంద్రబోస్ గెలిచారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన బోస్‌ను పక్కనబెట్టడానికి గాంధీజీ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. బోస్ యొక్క దేశభక్తి విధానాలు ముస్లిం లీగ్‌కు నచ్చదని, అందుకే ఆయనను కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసేలా గాంధీజీ కుట్ర పన్నారని భావిస్తారు.
5. పటేల్ ను కాకుండా నెహ్రూ వైపే మొగ్గుచూపడం
1946లో ప్రధాని పదవి కోసం జరిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్ కమిటీలు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వైపే స్పష్టమైన మొగ్గు చూపాయి. కానీ, గాంధీజీ పటేల్‌ను వెనక్కి తగ్గించి జవహర్లాల్ నెహ్రూను ప్రధానిగా ఎంపిక చేశారు. పటేల్ హిందూ అనుకూల వైఖరి ఉన్న నాయకుడని
గాంధీకి కోపం. ముస్లింలకు నొప్పి కలుగుతుందని దేశమంతా మెచ్చిన పటేల్ ను కాదని, నెహ్రూకు ప్రధానమంత్రి పదవి అప్పగించారు.
6. విభజన హింసలో హిందువులకే అహింసా బోధనలు
దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్ కార్యకర్తలు డైరెక్ట్ యాక్షన్ డే పేరిట హిందువులపై విపరీతమైన దాడులు చేశారు. ఆ సమయంలో గాంధీజీ హిందువులను మాత్రమే అహింసను పాటించాలని పట్టుపట్టారు. పైగా,, ముస్లింలు దాడి చేసినా భరించాలని ఉచిత సలహాలు ఇచ్చారు. ముస్లింలను కట్టడి చేయకుండా, హిందువులను మాత్రమే ఆత్మరక్షణ కూడా చేసుకో వద్దని కోరడం… ఆయన ముస్లిం పక్షపాతానికి పరాకాష్ట అనుకోవచ్చు.
7. పాకిస్థాన్‌కు 55 కోట్లు చెల్లించాలని నిరాహార దీక్ష
విభజన ఒప్పందం ప్రకారం భారతదేశం పాకిస్థాన్‌కు 55 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆక్రమణకు దిగడంతో ఆ నిధులను భారత ప్రభుత్వం నిలిపివేసింది. ఆ డబ్బు ఇస్తే, ఆయుధాలు కొనుక్కొని, భారత్ మీద యుద్దం తీవ్రతరం చేస్తుందని పటేల్ వంటి వారు పట్టుపట్టారు. కానీ, ఈ నిధులను పాకిస్థాన్‌కు వెంటనే విడుదల చేయాలని పట్టుబడుతూ గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. భారత ప్రయోజనాలను దెబ్బతీస్తూ, శత్రుదేశమైన పాకిస్థాన్‌కు ఆర్థికంగా సహాయం చేయడానికి గాంధీజీ దీక్ష చేశారు.
8. ఢిల్లీ మసీదుల నుంచి శరణార్థుల తొలగింపు
విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి ప్రాణభయంతో ఢిల్లీకి వచ్చిన హిందూ శరణార్థులు చలి నుంచి తప్పుకోవడానికి ఖాళీగా ఉన్న మసీదులలో ఆశ్రయం పొందారు. గాంధీజీ వారికి మద్దతు ఇవ్వడానికి బదులు, మసీదుల నుంచి తక్షణమే బయటకు వెళ్లాలని పట్టుబట్టారు. తీవ్రమైన చలిలో శరణార్థులు రోడ్డున పడినా పట్టించుకోకుండా, ముస్లింల ఆస్తులకు మరియు మసీదులకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ముస్లిం ప్రేమాభిమానాలకు మరో నిదర్శనంగా నిలిచింది.
9. మైనార్టీలకే ప్రభుత్వంలో పెద్ద పీట
స్వాతంత్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన పార్టీలు, సంఘాలను గాంధీ పక్కన పెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ కి పోటీ రావద్దన్నది ఆయన విధానం. అందుకే, చిన్నా చితక పార్టీలను పక్కన పెట్టేశారు. కానీ, మైనార్టీలు పేరుతో ముస్లిం నేతలకు పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద పీట వేశారు. కీలకమైన విద్యా శాఖను ముస్లింలకు పట్టు పట్టి మరీ ఇప్పించారు.
10. వందేమాతరం గీతంపై అభ్యంతరం
భారత స్వతంత్ర పోరాటానికి ఊపిరిపోసిన ‘వందేమాతరం’ గీతంపై ముస్లిం లీగ్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాతృభూమిని దేవతగా పూజించడం ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధమని వాదించారు. వెంటనే రంగంలోకి దిగిన గాంధీజీ వందేమాతరం గీతాన్ని పూర్తిగా పాడకుండా కొన్ని చరణాలకే పరిమితం చేయాలని సూచించారు.
….
ఇలా చెప్పుకొంటూ పోతే, గాంధీజీ అనుసరించిన ముస్లిం మైనార్టీ విధానాలు ఎన్నెన్నో కనిపిస్తాయి. అందుకే తర్వాత కాలంలో కాంగ్రెస్ నాయకులు కూడా.. ముస్లింలకు పెద్ద పీట వేస్తూ పరిపాలన సాగిస్తూ వచ్చారు. గాంధీ, నెహ్రూ అనుసరించిన ముస్లిం సంతుష్టీకరణ.. చివరకు ఈ దేశానికి పెద్ద శాపంగా మారిందని విమర్శకులు చెబుతూ ఉంటారు.



