……………………………………………..
దేశంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో, కాక్రోచ్ జనతా పార్టీ తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ‘స్కూల్ థిక్ కరో’ అనే కార్యక్రమం పేరిట చేస్తున్న హంగామా స్కూల్స్ ను ఇబ్బంది పెడుతోంది.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయాల్లాంటి బడులను రాజకీయ క్రీడలకు కేంద్రాలుగా మార్చడం తీవ్రంగా ఖండించదగిన అంశం.
……………………….
స్కూల్ థిక్ కరో పేరుతో దేశంలోని ప్రభుత్వ స్కూల్స్ ను తనిఖీ చేస్తామని కాక్రోచ్ జనతాపార్టీ ప్రకటించింది. దీని ప్రకారం కాక్రోచ్ పార్టీ పేరుతో కొంతమంది స్కూల్స్ లో చొరబడుతున్నారు. తనిఖీలు పేరుతో టీచర్స్ ను, అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ తనిఖీల వెనుక ఉన్న అసలు ఉద్దేశం విద్యాబోధనను మెరుగుపరచడం కాదని, అధికారులను మరియు ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయడమేనని స్పష్టమవుతోంది. పాఠశాలల్లోకి అనాలోచితంగా చొరబడటం, పనివేళల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడం, చిన్న చిన్న లోపాలను పెద్దవిగా చూపిస్తూ వారిని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించడం వంటి చర్యలకు కాక్రోచ్ జనతా పార్టీ దిగుతోంది. దీనివల్ల నిబద్ధతతో పనిచేసే అధికారుల మనోధైర్యం దెబ్బతినడమే కాక, పాఠశాలల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
…………………
పాఠశాల వాతావరణాన్ని దెబ్బతీస్తూ, విద్యార్థుల చదువుకు అడ్డంకిగా మారిన ఈ తరహా విధానాలపై క్షేత్రస్థాయిలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడానికి లేదా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, బడుల ప్రాంగణాల్లోకి ప్రవేశించి అరాచకం సృష్టించడాన్ని స్థానిక ప్రజలు సహించడం లేదు. విద్యార్థుల సమయాన్ని వృథా చేస్తూ నాటకాలుడుతున్న ఈ ముఠాలను అనేక ప్రాంతాల్లో స్థానికులు, తల్లిదండ్రులు తిప్పికొడుతూ తరిమికొడుతున్నారు. అనేక చోట్ల ఇప్పటికే కాక్రోచ్ పార్టీ కార్యకర్తలను స్థానికులు తరిమి తరిమి కొడుతున్నారు.
…………………………
విద్యావ్యవస్థలో సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి సంబంధిత విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు ఉంటారు. కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, ఉపాధ్యాయులను బ్లాక్మెయిల్ చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. బడులలో భయానక వాతావరణం సృష్టిస్తే విద్యాబోధన ఎలా సాగుతుందో ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి.
………………………..
ఇప్పటికైనా కాక్రోచ్ జనతా పార్టీ తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వ పాఠశాలలను సాధనంగా వాడుకోవడం మానుకోవాలి. పాఠశాలల ప్రశాంతతను భంగపరిచే ఇటువంటి చట్టవ్యతిరేక పనులను వెంటనే స్వస్తి పలకాలి. విద్యా వ్యవస్థను రక్షించుకోవడానికి మరియు పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని కాపాడుకోవడానికి స్థానికులు, ఉపాధ్యాయులు మరియు అధికారులు ఐక్యంగా నిలబడి ఈ అరాచకాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



