నమస్తే! ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను వేధించడం లో కొత్త కోణం బయటకు వచ్చిందా? ఒప్పుకోకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తామంటూ భయాందోళనకు గురిచేస్తున్నారా…? నిందితుడి ఆకృత్యాలకు అతడి కుటుంబం కూడా తోడై ఎలా ప్రోత్సహించింది? సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న ఇలాంటి మతోన్మాద ఘటనల వివరాలు ఇప్పుడు చూద్దాం.
……………………………………………………..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఓ బీటెక్ సెకండియర్ హిందూ విద్యార్థిని ప్రమాదంలో పడింది. అదే ప్రాంతానికి చెందిన పఠాన్ తౌఫీక్ ఖాన్ అనే ముస్లిం యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె తనను ప్రేమించడం లేదని చెప్పినా వినకుండా నిత్యం ఫోన్లు చేస్తూ వెంటపడ్డాడు. తనను పెళ్లి చేసుకొని మతం మారాలని, లేదంటే ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యులను చంపేస్తానని తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగాడు.
…
ఈ వేధింపులు తాళలేక బాధిత యువతి తల్లిదండ్రులు…. నిందితుడు తౌఫీక్ ఖాన్ కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేశారు. దీని మీద స్పందించలేదు సరికదా, వారు కూడా అతడిని సమర్థిస్తూ మరింత ప్రోత్సహించారు. నిందితుడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో, రక్షణ కల్పించాలని వేడుకుంటూ ఇల్లెందు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేయగా, ఇంటర్ తర్వాత చదువు మానేసి జులాయిగా తిరుగుతున్న తౌఫీక్ ఖాన్ క్రూరబుద్ధి బయటపడింది.
…………………………………………………….
ప్రేమ పేరుతో హిందూ బాలికలను, యువతులను లక్ష్యంగా చేసుకుని, మత మార్పిడుల కోసం చంపుతామని బెదిరించడం తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ఇటువంటి ఉన్మాదులకు అతడి కుటుంబం కూడా సహకరించడం ఈ అరాచకం ఏ స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. పోలీసులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని, అమాయక హిందూ యువతులకు పూర్తి రక్షణ కల్పించాలి.
………………..
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్క్రైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి దారుణాలను, నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!




