విశ్వ మాంగల్య సభ ప్రబోధన సమావేశం
ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎంఎస్ఎంఈ, యూసుఫ్‌గూడలో జూలై 25, 26 తేదీలలో రెండు రోజుల ప్రబోధన సమావేశం నిర్వహించబడింది.
అందులో భాగంగా విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో
హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఆదివారం ‘‘యుగానుకూల మాతృత్వం’’ అనే అంశంపై ఓ సదస్సు జరిగింది.
హైదరాబాద్‌లోని సేవాలాల్ బంజారా భవన్లో జూలై 25, 26 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన ‘దక్షిణ భారత ప్రబోధన్ బైఠక్’ సమావేశాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్ గారు పాల్గొని “యుగానుకూల మాతృత్వం” (సమకాలీన మాతృత్వం) అనే అంశంపై ప్రధానోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ మోహన్ భగవత్ గారు మాట్లాడుతూ.. సృష్టికి, పోషణకు, అలాగే మానవ మనుగడ కొనసాగింపునకు మాతృత్వమే మూలాధారం అని స్పష్టం చేశారు.
ఏ విషయం పైన మాట్లాడటానికి అయినా అనుభవం ని మించిన శక్తి లేదని, మనది అతి ప్రాచీన సంస్కృతి అని కనుక మన దేశంలో మాతృత్వం కూడా అంతే ప్రాచీనమైనది అని, మరి అంతటి అనుభవం కలిగిన మాతృమూర్తిల గురించి నన్ను మాట్లాడమనటం నన్ను పరీక్షించడానికే అంటూ చమత్కరించారు.
అయితే గత కొన్ని శతాబ్దాలుగా మన దేశం మీద పరాయి పాలకుల ఆధిపత్యం కొనసాగింది
అన్య సంస్కృతల ప్రభావం మన సంస్కృతి మీద నే కాకుండా మన నిత్య జీవన విధానంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో
“యుగానుకూల మాతృత్వం” (సమకాలీన మాతృత్వం)
విషయంలో మాట్లాడే అవకాశం మన అందరికి ఏర్పడుతుంది అవి అన్నారు.
సమాజంలో కుటుంబ విలువలు గురించి, భార్యాభర్తల బాధ్యత గురించి, వివాహం అనేది కుటుంబానికి నేపథ్యం అని ప్రస్తావించారు. కుటుంబం ల్లో విలువలు అనేవి చాలా ముఖ్యమని, అవసరం అని ప్రస్తావించారు, అవి త్యాగం నుండి ఏర్పడ్డాయని అన్నారు.
మన సమాజంలో అందరూ సమానమే అని, స్త్రీ పురుషుల అన్నింటా సమానంగా ఉంటారని కాని స్త్రీ కి ప్రతి సృష్టి చేయగల శక్తిని కూడా కలిగి ఉంటుంది అన్నారు.
మన సంస్కృతి ల్లో మహిశలసు శక్తి స్వరూపిణి గా ఆరాధిస్తారు అని అన్నారు. కానీ మారుతున్న కాలంలో మహిళను దాసిగా చూడటం అనేది మంచిది కాదని అన్నారు.
మన ఆలోచనలు ఇప్పుడు మారుతూ ఉన్నాయని అన్నారు.
మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు సహజమని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రాచీన ఆచారాల వైపు వెళ్లటం
ఎలా సాధ్యం కాదో , అలాగే పాశ్చాత్య దేశాల సంస్కృతి ని అనుసరించటం మంచి కాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వ మాంగల్య సభ వ్యవస్థాపకులు పూజ్య శ్రీ జితేంద్రనాథ్ మహారాజ్ గారు, జాతీయ సంఘటన మంత్రి డాక్టర్ రుశాలి జోషి గారు, అఖిల భారత విశ్వ మాంగల్య సభ మార్గదర్శకులు శ్రీ ప్రశాంత్ జీ హోల్కర్ గారు, విశ్వ మాంగల్య సభ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి నలిని హవాడే గారు, జాతీయ సంఘటన మంత్రి డాక్టర్ రుశాలి జోషి గారు,
సూరజ్ జీ దామోర్ విశ్వమాంగల్య సభ జాతీయ ఉపాధ్యక్షుడు , భగవతి జీ బాల్డ్వా – స్వాగత సమితి అధ్యక్షురాలు, సహ కార్యదర్శి శ్రీమతి శృతి బొడ్డుపల్లి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమానికి మార్గదర్శనం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర దక్షిణ భారత రాష్ట్రాల నుంచి సుమారు 150 మంది విశ్వ మాంగల్య సభ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ ‘దక్షిణ భారత ప్రబోధన్ బైఠక్’ సమావేశాల్లో దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి మహిళా ప్రతినిధులు, ప్రముఖులు, మాతృమూర్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
More Photos:





