………
దేశంలో ప్రస్తుతం విద్యాశాఖ చుట్టూ రాజకీయ అల్లకల్లోలం సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కొన్ని విద్యార్థి సంఘాలు, కొన్ని ప్రతిపక్షాలు మొండి పట్టుపట్టాయి. పార్లమెంటు సమావేశాలు నిలిపివేసాయి. ఢిల్లీలో తీవ్ర అలజడి సృష్టించాయి. చివరకు కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇంతకీ ఆయన్నే ఎందుకు టార్గెట్ చేశారో.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
..
ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రస్థానం నిబద్ధతకు, అంకితభావానికి, కష్టపడే తత్వానికి నిదర్శనం. ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా తన ప్రజా రంగాన్ని ప్రారంభించి, విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ, దశాబ్దాల పాటు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆయనకు అప్పగించిన ప్రతి బాధ్యతనూ అత్యంత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వర్తించారు. గతంలో పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చూపిన చొరవ అసాధారణమైనది. చారిత్రాత్మక ఉజ్జ్వల పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్ల మంది పేద, గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఎంతటి సంక్లిష్టమైన శాఖనైనా తనదైన కార్యదీక్షతో, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా నిర్వహించి ప్రజాదరణ పొందిన నాయకుడు ఆయన.
………………..
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ దేశ విద్యావ్యవస్థ రూపురేఖలను మార్చేశారు. ఆధునిక సవాళ్లకు అనుగుణంగా తయారు చేసిన నూతన జాతీయ విద్యా విధానాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేశారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో భారతీయ విద్యావ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు, విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశారు. ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు మాతృభాషలోనే బోధనకు ప్రాధాన్యతనిస్తూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేశారు. డిజిటల్ విప్లవంలో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తరగతి గదులకు అనుసంధానించారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు నిధులు పెంచడం వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులను ఆయన వేగవంతం చేశారు.
,…………………..
అయితే, దేశంలో విద్యాశాఖ ఈ స్థాయిలో వేగంగా బాగుపడటం, అవినీతి రహిత పారదర్శకమైన విధానాలు అమలు కావడం కొందరు స్వార్థపూరిత శక్తులకు అస్సలు ఇష్టం ఉండటం లేదు. విద్యావ్యవస్థ బలోపేతమై, విద్యార్థులు చైతన్యవంతమైతే తమ రాజకీయ ఉనికి పూర్తిగా దెబ్బతింటుందనే భయంతోనే ఈ ఆందోళనలను వెనుక ఉండి రెచ్చగొడుతున్నారు. ఏమాత్రం వివేకం లేకుండా, ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వాస్తవాలను వినకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరారు. కేవలం తమ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలే. విద్యాశాఖ సాధిస్తున్న పురోగతిని, సాధిస్తున్న విజయాలను జీర్ణించుకోలేకే ఈ తరహా నిరసనలతో గందరగోళం సృష్టించారు.
……………….
సంస్కరణలు వేగవంతమవుతున్న ఇటువంటి కీలక సమయంలో దుష్ప్రచారాలు, రాజకీయ కుట్రల పట్ల దేశ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థి లోకం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యావ్యవస్థను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటుందని గుర్తించాలి. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో నిబద్ధత గల నాయకునికే విద్యాశాఖ అప్పగిస్తారు అనడంలో సందేహం లేదు.
దేశ అభివృద్ధిని, విద్యా రంగ పురోగతిని అడ్డుకోవాలని చూసే ఇటువంటి కుట్రలను తిప్పికొడుతూ, భావి భారత ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



