
…………………………………………………..
నమస్తే! కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున్ ఖార్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్ అక్రమాలను బయటపెడితే ఏమయిందో తెలుసా… ఒక సీనియర్ జర్నలిస్టుకు బెదిరింపులు వచ్చాయని తెలుసా..? ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారా….? కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను అణచివేస్తూ, బెదిరింపులకు పాల్పడేవారికి కొమ్ముకాస్తోందా….? ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
…………………………………………………….
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే కుటుంబానికి చెందిన ‘సిద్ధార్థ విహార్ ట్రస్ట్’ అక్రమాలకు పాల్పడుతోందని సమాచారం. దీనిపై కన్నడ పత్రిక ‘ది ఫైల్’ ఎడిటర్ జి. మహంతేష్.. వరుస కథనాలు ప్రచురించారు. కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి సంస్థ …. ఏరోస్పేస్ పార్క్‌లో ఖర్గే కుటుంబానికి భూములు కేటాయించారు. అత్యంత విలువైన స్థల కేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ వార్తలు ప్రచురితమైన వెంటనే ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. ఆ కథనాలను వెంటనే తొలగించాలని, లేకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని, చంపేస్తామని బెదిరింపులకు దిగారు.
……..
దీంతో జర్నలిస్ట్ మహంతేష్ పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అయితే కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో పోలీసులు మొదట్లో కేసు తీసుకోలేదు. దీనిపై కర్ణాటక వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, ప్రతిపక్ష బీజేపీ తీవ్ర నిరసనలు తెలిపాయి. పోలీసుల తీరును తప్పుబడుతూ కోర్టును ఆశ్రయించారు. తర్వాత న్యాయస్థానం ఆదేశించిన తర్వాతే పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేశారు. ఖార్గే కుటుంబం పేరు బయటకు రాకుండా చూసేందుకే పోలీసులు ఇన్నాళ్లూ కాలక్షేపం చేశారు.
…………………………………………………………………………………….
నిజాలను బయటపెట్టే విలేకరులను బెదిరించడం తీవ్రంగా ఖండించాల్సిన అంశం. తమ నాయకుల అక్రమాలు బయటపడగానే జర్నలిస్టులను బెదిరించటం కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనం. భావప్రకటన స్వేచ్ఛ గురించి వేదికలపై గొప్పలు చెప్పే కాంగ్రెస్ నాయకులు అసలు రంగు ఇదే.. కానీ,, తమ స్వంత విషయంలో మాత్రం విలేకరుల గొంతు నొక్కడానికి ప్రయత్నించడం వారి నైజానికి అద్దం పడుతోంది.
……..
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి అక్రమాలను, నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!



