
………………………………………………………………..
నమస్తే! 2020లో జరిగిన ఈశాన్య ఢిల్లీ హిందూ వ్యతిరేక దాడుల వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరు..? భజన్‌పురా పెట్రోల్ పంప్ వద్ద అగ్నికీలలు రేపి, హిందువుల ఆస్తులనే ఎందుకు టార్గెట్ చేశారు.. ? ఈ ఘటనలో న్యాయస్థానం ఏమని సంచలన తీర్పు ఇచ్చింది..? హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలపై కోర్ట్ ఏమని వ్యాఖ్యానించింది…? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
…………………………………………………………………
2020 ఢిల్లీ దాడుల సమయంలో భజన్‌పురాలోని పెట్రోల్ పంప్‌ను తగలబెట్టిన కేసు గుర్తు ఉంది కదా. .? ఈ కేసు మీద ఢిల్లీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ అల్లర్లలో పాల్గొన్న షానవాజ్, మహమ్మద్ షుఐబ్, షారూఖ్, రషీద్, మహమ్మద్ ఫైజల్ అనే ఐదుగురు వ్యక్తులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. చట్టవిరుద్ధంగా గుమిగూడటం, రాళ్లు రువ్వడం, పెట్రోల్ పంప్‌పై దాడి చేసి నిప్పు పెట్టడం వంటి తీవ్రమైన ఆరోపణలు రుజువయ్యాయి.
……..
సాక్షుల సాక్ష్యాలు, వీడియో ఆధారాలను పరిశీలించిన కోర్టు.. నిందితులు ప్రణాళికాబద్ధంగానే ఈ హింసకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల పేరుతో హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. హిందువుల ఆస్తులనే విధ్వంసానికి పూనుకున్నారనేది విచారణలో వెల్లడైంది. నిందితులు గుంపులుగా ఏర్పడి భయాందోళనలు సృష్టించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. హిందువుల మీద భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసం వెనుక కుట్రలు బయట పడ్డాయి.
……………………………………………………………………
ఢిల్లీ దాడుల వెనుక ఉన్న కుట్రలు ఒక్కొక్కటిగా విచారణలో బయటపడుతున్నాయి. దోషులకు శిక్షలు పడుతుండటం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతోంది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల పేరుతో జరిగిన హిందూ వ్యతిరేక అల్లర్లు జరిగాయి. అసలు దోషులకు చట్టం శిక్ష విధించటం గమనించాల్సిన విషయం. ఈ తీర్పు భవిష్యత్తులో దేశంలో హింసను ప్రేరేపించే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తుంది.
…………
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్క్రైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!




