…………………………………………………………….
నేటి డిజిటల్ భారతంలో ప్రతిఒక్కరూ అత్యంత సులువుగా మొబైల్ ద్వారానే పూర్తిచేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా విప్లవం దేశ ప్రజల జీవనశైలిని మార్చివేసింది. నగదు రహిత సమాజం వైపు గొప్ప అడుగు వేయించింది. అయితే యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు పడతాయని సోషల్ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజలలో తీవ్ర గందరగోళాన్ని, ఆందోళనను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీఐ సేవలు ఎప్పటికీ పూర్తిగా ఉచితమేనని కేంద్రం హామీ ఇస్తోంది. సామాన్య వర్గాలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చూడటంలో కేంద్రం ఎప్పుడూ ముందుంటుంది.
……………………………………………………………….
నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి పంపే డబ్బుపై ఎటువంటి ఛార్జీలు ఉండనే ఉండవు. షాపులలో 2 వేల లోపు చేసే చెల్లింపులపై కూడా ఎలాంటి రుసుము ఉండదు. వ్యాపార లావాదేవీలపై గరిష్టంగా 300 రూపాయలు వరకు ఛార్జీ పడే ఛాన్స్ ఉంది. అది కూడా కేవలం వ్యాపారస్తులు మాత్రమే భరిస్తారు తప్ప సాధారణ కస్టమర్ల అకౌంట్ల నుండి పైసా కూడా కట్ కాదు. ఉదాహరణకు రెస్టారెంట్లో బిల్లు కట్టినా లేదా ఏదయినా కొనుగోలు చేసినా కస్టమర్ కేవలం ఆయా మొత్తాలను మాత్రమే చెల్లిస్తారు; వాటిపై పడే పన్నులు/ఛార్జీలను సదరు వ్యాపారులే చెల్లిస్తారు. పెట్రోల్ బంకులు, రైల్వే టికెట్లకు రూ. 2,000 దాటినా కేవలం రూ. 5 ఫ్లాట్ ఛార్జీని ఆ సంస్థలే భరిస్తాయి.
…………………………………………………………….
చిన్న వ్యాపారులను, వీధి వ్యాపారులను ఆదుకోవడంలో మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉంటుంది. నెలకు రూ. 1 లక్ష లోపు డిజిటల్ చెల్లింపులు అందుకునే చిన్న కిరాణా కొట్లు, వీధి వ్యాపారులకు ఈ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు. క్రెడిట్ కార్డుల మాదిరిగా ఈ ఛార్జీల భారాన్ని కస్టమర్లపైకి నెట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలా చేసే వ్యాపారులు లేదా బ్యాంకులపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఈ చిన్నమొత్తపు రుసుములను వినియోగిస్తారు.
…………………
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా ఉచితంగా అందుబాటులో ఉంచేందుకు కట్టుబడి ఉంది. ప్రధాని మోదీ తెచ్చిన విప్లవాత్మక డిజిటల్ విధానాల వల్ల ఈరోజు ప్రతీ పౌరుడు లబ్ధి పొందుతున్నారు. ప్రజలను భయాందోళనలకు గురిచేసే వర్గాల మాటలను నమ్మవద్దని కేంద్రం చెబుతోంది. ప్రభుత్వం విడుదల చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే గమనించి వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.



