
నమస్తే,
ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో మతా ప్రచారాలు, ఒత్తిళ్లకు చోటుండవచ్చా? విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురుకులాల్లో విద్యార్థులపై మతపరమైన ఆచారాలు రుద్దడం ఏమిటి..? అసలు.. క్యాంపస్‌లోనే చర్చి తరహా నిర్వహణలు చేపట్టడం ఎంత వరకు కరెక్ట్..? సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గురుకుల్ సొసైటీ స్కూల్ లో జరిగిన గొడవ.. వివరాలు ఇప్పుడు చూద్దాం..
…………………………………………………………………………
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఇస్నాపూర్ – చిట్కుల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో తీవ్రమైన వివాదం రాజుకుంది. కొందరు సీనియర్లు ప్రతి ఆదివారం .. క్యాంపస్ లోనే చర్చి పెట్టి,, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇతర విద్యార్థులను కూడా ఆ ప్రార్థనల్లో పాల్గొనాలని, బైబిల్ చదవాలని తీవ్రమైన ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ గురుకులంలో సాగుతున్న ఈ పరిణామాలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు.
………………
ఈ విషయం స్థానిక ఎమ్మెల్సీ అంజిరెడ్డి దృష్టికి వెళ్లడంతో మ్యాటర్ బయటకు వచ్చింది. సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇలాంటి మతపరమైన ఒత్తిళ్లు తగవని ఎమ్మెల్సీ సీరియస్‌గా పరిగణించారు. పూర్తి ఆధారాలు, వివరాలతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటువంటి అక్రమ మత ప్రచారాలు సహించేది లేదని స్పష్టం చేయడంతో, కలెక్టర్ వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించారు.
…………………………………………………………………………..
ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు పేద విద్యార్థుల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం నిర్మించినవి. అటువంటి పవిత్రమైన దేవాలయాల్లాంటి పాఠశాలల్లో మతపరమైన ప్రచారాలు చేయటం తప్పు. ఇటువంటి ఒత్తిళ్లు.. విద్యార్థుల మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. విద్యాసంస్థల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అధికారులు, యాజమాన్యంపై ఉంది. ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోకపోతే, గురుకులాల మూల ఉద్దేశమే దెబ్బతింటుంది.
…..
ఇలాంటి అనేక కీలకమైన అంశాలు లోతైన విశ్లేషణలను నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకువస్తోంది మన మై ఇండ్ మీడియా. జాతీయవాదాన్ని అందరికీ వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేయండి. సమాజంలో చైతన్యం నింపేందుకు ఈ వీడియోను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు!




