……………………………….
నమస్తే,
ఉగ్రవాద సంస్థలు తమ పాత వ్యూహాలను మార్చుకుని దేశ సరిహద్దుల లోపలే మకాం వేసి వినాశనం సృష్టించేందుకు ఎలాంటి పథకాలు వేస్తున్నాయి? సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ వంటి విదేశాలకు వెళ్లి యుద్ధం చేయడం కంటే భారతదేశంలోనే ఉంటూ తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయాలనే కొత్త పిలుపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ముఖ్యంగా బడికి, కళాశాలలకు వెళ్లే చిన్న వయసు పిల్లలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ ఆన్లైన్ కుట్ర ఎంత ప్రమాదకరమైనది? భారత నిఘా వర్గాలు విశ్లేషించిన ఐసిస్ నయా వ్యూహం వెనుకున్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం…
……………………………………………………….
భారతీయ యువతను ఐసిస్ లేదా అల్ ఖైదాలో చేర్పించి సిరియా, ఇరాక్ వంటి దేశాలకు పంపించేవారు. అక్కడ ఉగ్రవాదం మీద శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నించేవారు. కానీ భారత నిఘా సంస్థల నిరంతర నిఘా, వల్ల విదేశాలకు వెళ్లే వారి సంఖ్య దాదాపు సున్నాకి పడిపోయింది. దాంతో ఐసిస్ ఉగ్ర సంస్థ తన పనితీరును పూర్తిగా మార్చుకుంది. భారత్ వదిలి రావద్దని, మీ స్వదేశంలోనే ఉంటూ స్థానికంగా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయాలని చెబుతోంది. ప్రాంతీయ స్థాయిలో చిన్న చిన్న నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయాలని తమ ఆన్లైన్ ఏజెంట్లకు ఐసిస్ ఆదేశాలు జారీ చేస్తోంది.
………………..
మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఉగ్ర సంస్థలు ఇప్పుడు పాఠశాలలు, కళాశాలల్లో చదివే టీనేజర్లను ఆన్లైన్ ద్వారా లక్ష్యంగా చేసుకుంటున్నాయి. టెలిగ్రామ్, వాట్సాప్, జూమ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మతపరమైన తరగతుల పేరుతో చేర్చుకుంటున్నారు. అక్కడ భారతదేశం మీద మెల్లగా విద్వేష భావజాలాన్ని నూరిపోస్తున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) జరిపిన తనిఖీల్లో ఇది బయట పడింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్రల్లో ఈ ఆన్లైన్ తీవ్రవాద నెట్వర్క్ విస్తరిస్తున్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా హైదరాబాద్ మీద ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
………………………………………………………………..
ఇప్పటివరకు దేశ సరిహద్దుల వద్దే ముప్పు ఉందనుకున్న మనకు.. ఇప్పుడు ప్రతి ఇంట్లో, ప్రతి మొబైల్ ఫోన్ రూపంలో ఉగ్రవాద ముప్పు పొంచి ఉందనేది స్పష్టమవుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో నిరంతరం గమనించాలి. డిజిటల్ ప్రపంచంలో మతం పేరుతో నూరిపోసే విద్వేషాల పట్ల యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే దేశ అంతర్గత భద్రతకే ముప్పు వాటిల్లుతుందని సమాజం గుర్తించాలి.
…………………………………….
ఇలాంటి అనేక కీలకమైన అంశాలు, జాతీయ దృక్పథంతో కూడిన నిజాలు మరియు లోతైన విశ్లేషణలను నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకువస్తోంది మన మై ఇండ్ మీడియా. జాతీయవాదాన్ని అందరికీ వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేయండి. సమాజంలో చైతన్యం నింపేందుకు ఈ వీడియోను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు!



