………………………………………………………………
నమస్తే,
మతం మారిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందవచ్చా? మతాంతరం పొంది కూడా దళితులకు ఇచ్చే రాయితీలు, చట్టపరమైన హక్కులు పొందాలనుకోవడం సమర్థనీయమేనా? రాజ్యాంగం కల్పించిన ఫలాలను మతం మారిన తర్వాత కూడా అనుభవించవచ్చా లేదా అనేది ఇప్పుడు మద్రాస్ హైకోర్టు తీర్పుతో సంచలనంగా మారింది. న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పు వెనుకున్న అసలు విషయాలు.. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం…
………………………………………………………………….
క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి, దళితుడి పేరుతో కులవివక్ష వ్యతిరేక అట్రాసిటీ చట్టం కింద రక్షణ కోరలేరని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తేని జిల్లాకు చెందిన ఒక టీచర్.. తమ పాఠశాల హెచ్ఎం, కరస్పాండెంట్ తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. వాళ్ల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే జస్టిస్ విక్టోరియా గౌరి నేతృత్వంలోని మధురై ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. వేరే మతంలోకి మారిపోయాక.. చట్టప్రకారం దళితుడు పొందాల్సిన రాయితీలు, రక్షణలు కోరుకోవడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేస్తూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
…..
న్యాయస్థానం తన తీర్పులో 1950 రాజ్యాంగ సవరణను స్పష్టంగా గుర్తుచేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాల నుంచి ఇతర మతాల్లోకి మారిన వారిని దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా పరిగణించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. మతం మారిన తర్వాత కూడా అట్రాసిటీ చట్టం రక్షణను పొందాలనుకోవడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మతం మారి కూడా ఎస్సీ రిజర్వేషన్లు, అట్రాసిటీ చట్టాలను వాడుకుంటున్న వ్యవహారాలపై న్యాయపరమైన స్పష్టత వచ్చింది.
…………………………………………………………………………………
మన దేశంలో మతం మారినప్పటికీ దళిత హక్కులు, ప్రభుత్వ రాయితీలను అనుభవించే ధోరణిపై ఈ తీర్పు ఒక కనువిప్పు లాంటిది. రాజ్యాంగం అందించే ఫలాలు నిజమైన అర్హులైన దళితులకే అందాలి తప్ప, మతాంతరం చెంది కూడా దళిత కార్డును ఉపయోగించుకునే వారికి కాదు. ఈ విషయంలో రాజ్యాంగ ఫలాలను దుర్వినియోగం చేయడంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
…………………………………
ఇలాంటి అనేక కీలకమైన అంశాలు., లోతైన విశ్లేషణలను నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకువస్తోంది మన మై ఇండ్ మీడియా. జాతీయవాదాన్ని అందరికీ వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేయండి. సమాజంలో చైతన్యం నింపేందుకు ఈ వీడియోను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు!




