శత్రువుల స్థావరాల్లోకి మన సైనికులు అడుగుపెట్టకుండానే, వంద కిలోమీటర్ల దూరం నుండి శత్రువుల అంతుచూసే అద్భుతమైన రోబోట్ మన సైన్యం చేతికి వస్తే ఎలా ఉంటుంది? కొండలు, లోయలు, మందుపాతరలు ఉన్న ప్రమాదకరమైన ప్రాంతాల్లో మన జవాన్ల ప్రాణాలను కాపాడే ఒక సంచలన ఆవిష్కరణ మన దేశంలోనే రూపుదిద్దుకుంది. భవిష్యత్తు యుద్ధాల రూపురేఖలను మార్చేయబోతున్న ఈ స్వదేశీ రోబోటిక్ సాంకేతికత అసలు ఎలా పనిచేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
…………………………………………………..
మన దేశంలోనే ఒక స్టార్టప్ కంపెనీ.. స్వదేశీ రోబో ను తయారు చేసింది. ఇది కొండ గుట్టల్లోకి సైతం సునాయాసంగా వెళ్లిపోతుంది. భూమిపై వెళ్లే రోబోట్‌తో పాటు ఆకాశంలో ఎగిరే ఒక ప్రత్యేక డ్రోన్ కలిసి పనిచేస్తాయి. సాధారణంగా కొండలు, లోయలు లేదా పెద్ద భవనాలు అడ్డు వచ్చినప్పుడు సిగ్నల్స్ కట్ అయిపోతాయి. కానీ ఈ డ్రోన్ గాలిలోనే ఉంటూ గాలిలోని కమ్యూనికేషన్ టవర్లా పనిచేస్తుంది. దీనివల్ల 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమాండ్ సెంటర్ నుండి సైనికులు ఎటువంటి అంతరాయం లేకుండా ఈ రోబోట్‌ను స్క్రీన్లపై చూస్తూ ఆపరేట్ చేయగలరు.
….
రోబోట్‌కు అమర్చిన 360 డిగ్రీల నైట్ విజన్ కెమెరాలు, సెన్సార్లు చీకట్లో కూడా శత్రువుల కదలికలను నిమిషాల్లో పసిగడతాయి. ఇందులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదకరమైన ప్రాంతాలు, మందుపాతరలు ఎక్కడున్నాయో ముందే గుర్తించి అధికారులకు సమాచారం ఇస్తుంది. అంతేకాకుండా, శత్రువులను ఎదుర్కొనేందుకు దీనిపై గన్స్, గ్రెనేడ్ లాంచర్లను అమర్చి, సుదూర ప్రాంతం నుంచే శత్రు స్థావరాలపై ఖచ్చితమైన దాడి చేయవచ్చు.
……………………………………………………………………….
మిత్రులారా… మన యువ ఇంజనీర్లు సాధిస్తున్న ఈ విజయాలు భారత రక్షణ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఒకప్పుడు రక్షణ పరికరాల కోసం విదేశాలపై ఆధారపడిన మనం, ఇవాళ స్వదేశీ సాంకేతికతతో శత్రువులకు సమాధానం చెప్తున్నాం. మన సైనిక శక్తిని, మన ఇంజనీర్ల ప్రతిభను చాటిచెప్పే ఈ గొప్ప విజయాన్ని మీ మిత్రులందరితో గర్వంగా పంచుకోండి.
……………
భారత రక్షణ రంగానికి సంబంధించిన ఇలాంటి గొప్ప విషయాలను మీ ముందుకు తెస్తున్న మన ‘మై ఇండ్ మీడియా’ ఛానెల్‌ను ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, మన జవాన్లకు మద్దతుగా కింద కామెంట్ సెక్షన్లో ‘జై హింద్’ అని టైప్ చేయండి. ధన్యవాదాలు, జై హింద్!



