నమస్కారం మై ఇండ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. మన దేశంలోని కొందరు సినీ ప్రముఖులకు హిందువుల రక్తం చిందినప్పుడు రాని బాధ, కేవలం కొందరిపై చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఎందుకు వస్తోంది? కాశ్మీర్‌లోని పహల్గామ్లో హిందువులను దారుణంగా చంపినప్పుడు నోరు విప్పని ఈ బాలీవుడ్ నటులకు ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది? పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో హిందూ సోదరీమణులపై, నిరపరాధులపై దాడులు జరుగుతుంటే కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయని వీళ్లకు, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జ్ అనగానే గుండెలు ఎందుకు తరుక్కుపోతున్నాయి? ఇది ప్రజాస్వామ్యం పై ప్రేమా, లేక హిందూ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చే రాజకీయ కుట్రనా?
…………………………………………………..
ఢిల్లీ లో పార్లమెంటుకు దాడికి ప్రయత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీని మీద బాలీవుడ్ నటులు వరుసగా గుండెలు బాదేసుకొంటున్నారు. కాశ్మీర్ లోయలో నిరపరాధులైన హిందువులను తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నప్పుడు ఈ బాలీవుడ్ భామలు, నటులు ఎవరూ నోరు మెదపలేదు. బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లను తగలబెడుతూ, ఆలయాలను కూలుస్తుంటే వీరికి అది అన్యాయంగా అనిపించలేదు. కానీ, ఢిల్లీలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న విద్యార్థులపై పోలీసులు చర్యలు తీసుకోగానే, వరుసగా సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. “ఇది చాలా దారుణం, మా గుండె తరుక్కుపోతోంది” అంటూ నకిలీ సానుభూతి వొలకబోస్తున్నారు.
……………….
ఈ చర్యల వెనుక వీరి ‘సెలెక్టివ్ సెక్యులరిజం’ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వర్గానికి అన్యాయం జరిగితే మాత్రమే వీరికి మానవత్వం గుర్తుకొస్తుంది, అదే హిందువులు బలవుతుంటే మాత్రం మౌనంగా ఉండిపోతారు. తమ సినిమాల ప్రమోషన్ల కోసం హిందూ ప్రేక్షకులను వాడుకునే వీరు, ధర్మంపై దాడి జరిగినప్పుడు మాత్రం తమ స్వార్థ రాజకీయాల కోసం నోళ్లు మూసుకుంటారు. దేశంలో అశాంతిని సృష్టించే శక్తులకు మద్దతుగా నిలవడమే వీరికి అలవాటుగా మారింది.
……………………………………………………………………….
మిత్రులారా… ఇకనైనా ఈ ద్వంద్వ నీతిని, నకిలీ లౌకికవాదాన్ని సమాజం నిలదీయాలి. మన ప్రాణాలకు, మన ధర్మానికి విలువ ఇవ్వని వారి ప్రచారాలను, వారి సినిమాలను తిరస్కరించాల్సిన సమయం వచ్చింది. నిజమైన దేశభక్తి ఏంటో, నిజమైన న్యాయం ఏంటో వీరికి అర్థమయ్యేలా మనమంతా ఒకే తాటిపైకి రావాలి. ఈ నకిలీ ప్రముఖుల వైఖరిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.
…..
ఇలాంటి సెలెక్టివ్ రాజకీయాలను ఎండగడుతూ, జాతీయవాద గళాన్ని నిర్భయంగా వినిపిస్తున్న మన ‘మై ఇండ మీడియా’ ఛానెల్‌ను ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, ప్రతి ఒక్కరికీ చేరేలా వెంటనే షేర్ చేయండి. ధన్యవాదాలు, జై హింద్, జై శ్రీరామ్!




