……………………………………………………………..
మనం ప్రతి చిన్న సినిమా ముచ్చటను, క్రికెట్ ఆటగాళ్ల రికార్డులను సోషల్ మీడియాలో ఎంతో సంబరంగా షేర్ చేసుకుంటాం కదా? మరి మన దేశ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే ఒక గొప్ప విజయాన్ని మన శాస్త్రవేత్తలు సాధిస్తే మనం ఎంతలా జరుపుకోవాలి? అమెరికా, ఫ్రాన్స్ వంటి పెద్ద పెద్ద దేశాలు కూడా “ఇది మా వల్ల కాదు” అని చేతులెత్తేసిన సాంకేతికతను మన భారతీయులు ఎలా సాధించారో తెలుసా? చెన్నైకి దగ్గరలోని కల్పక్కంలో జరిగిన ఆ అద్భుతం ఏంటో, రాబోయే వందల ఏళ్లపాటు మన విద్యుత్ కష్టాలను అది ఎలా తీర్చబోతోందో ఎప్పుడైనా ఆలోచించారా? రెండు నెలల క్రితం ఈ అద్భుతం సాధిస్తే.. ఎక్కడా ఉలుకు పలుకూ లేదంటే దారుణం కదా..
………………………………………………………………..
కల్పక్కంలో మన శాస్త్రవేత్తలు ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. సాధారణంగా రియాక్టర్లలో వాడిన కొద్దీ ఇంధనం కాలిపోయి బూడిదవుతుంది. కానీ ఈ రియాక్టర్ తాను వాడే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని తనే తయారు చేసి ఇస్తుంది. దీనితో పాటు సముద్రపు ఇసుకలోని ‘థోరియం’తో విద్యుత్ తయారుచేసే దిశగా భారత్ అడుగులు వేసింది. దీనివల్ల రాబోయే 300 ఏళ్లకు సరిపడా ఉచిత, చౌకైన విద్యుత్ మనకు లభించడమే కాక, విదేశాల నుంచి ఇంధనం కొనాల్సిన అవసరమే ఉండదు.
………
అంతేకాదు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అణుశక్తి సాయంతో అత్యంత స్వచ్ఛమైన ‘గ్రీన్ హైడ్రోజన్’ను తయారుచేసి మనవాళ్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. అత్యంత ప్రమాదకరమైన ‘ద్రవ సోడియాన్ని’ నియంత్రించి,,,,,,,,,,,, మన భారతీయులు ఈ విజయాన్ని అందించారు. ఈ విజయంతో వాతావరణ కాలుష్యం తగ్గడమే కాదు, గల్ఫ్ దేశాలపై పెట్రోల్ ఆధారపడే పనిలేకుండా మన పరిశ్రమలు మన సొంత హైడ్రోజన్ ఇంధనంతోనే నడుస్తాయి.
………………………………………………………………………………………….
మిత్రులారా… కల్పక్కం విజయం అనేది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, అది భారతీయ శాస్త్రీయ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఒకప్పుడు “భారతదేశం వల్ల ఏమవుతుంది?” అని వెక్కిరించిన ప్రపంచ దేశాల ముందు, “భారతదేశం మాత్రమే ఇది చేయగలదు” అని మన సైంటిస్టులు నిరూపించారు. మన పిల్లల భవిష్యత్తును వెలిగించే ఈ గొప్ప చారిత్రాత్మక విజయాన్ని మనమందరం గర్వంగా పంచుకుందాం. మన శాస్త్రవేత్తల త్యాగాలకు గర్వంగా సెల్యూట్ చేద్దాం.
…………………….
భారతదేశ గొప్పదనాన్ని, మన శాస్త్రవేత్తల ప్రతిభను, జాతీయవాద సత్యాలను మీ ముందుకు తెస్తున్న మన ‘మై ఇండ్ మీడియా’ ఛానెల్‌ను ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ దేశభక్తి సందేశాన్ని మీ మిత్రులందరికీ చేరేలా వెంటనే షేర్ చేయండి. ధన్యవాదాలు, జై హింద్, భారత్ మాతా కీ జై!




