బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల రక్షణ కోసం పోరాడుతున్న స్వామి చిన్మయ కృష్ణ దాస్‌పై తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. ఆయనను తప్పుడు కేసులతో జైల్లో బంధించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కనీసం ప్రాథమిక మానవ హక్కులను కూడా ఆయనకు నిరాకరిస్తున్నారు. నిత్యం మానవ హక్కుల గురించి మాట్లాడేవారు ఈ అన్యాయంపై మౌనంగా ఉండటం శోచనీయం.
బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లు, దేవాలయాలపై దాడులు పెరిగినప్పుడు స్వామి చిన్మయ దాస్ శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. “మేము ఈ దేశ పౌరులం, మా ప్రాణాలను కాపాడుకునే హక్కు మాకుంది” అని ఆయన బిగ్గరగా నినదించారు. హిందువుల తరపున పోరాడటమే ఆయన చేసిన ఏకైక తప్పుగా మారింది. చిన్మయదాస్ పై లేనిపోని దేశద్రోహం కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేసింది. రెండు సంవత్సరాలుగా బెయిల్ రాకుండా నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆయనను సుదీర్ఘ కాలం పాటు జైలులోనే ఉంచారు. ఒక ఆధ్యాత్మిక వేత్తపై ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వేధించడం అక్కడి పాలకుల అణచివేత ధోరణికి అద్దం పడుతోంది.
ఈ నిర్బంధం నడుమే ఇటీవల ఒక తీవ్రమైన విషాదం జరిగింది. జైల్లో ఉన్న చిన్మయ దాస్ తల్లిగారు తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. చనిపోయేముందు కొడుకును ఒక్కసారి చూడాలని ఆమె కోరుకున్నారు. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం అందుకు అనుమతించలేదు. చివరకు అంత్యక్రియల కోసం కేవలం 5 గంటల పెరోల్ మాత్రమే ఇచ్చి, ఆ వెంటనే మళ్లీ జైలుకు తరలించారు.
…..
ఇంతటి ఘోరం జరుగుతున్నా మన దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, మేధావులు నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇక్కడ బాధితులు హిందూ సాధువులు, వేధిస్తున్నవారి మతం గురించి తెలిసిందే. అందుకే గప్ చుప్ అయిపోయారు. కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు మాత్రమే బంగ్లాదేశ్ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించాయి. స్వామి చిన్మయ దాస్‌ను వెంటనే విడుదల చేయాలని అవి డిమాండ్ చేశాయి. ఒక సన్యాసికి జరిగిన ఈ అన్యాయం కేవలం ఆయన ఒక్కరి సమస్య కాదు. ఇది బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రతకు సంబంధించిన విషయం. ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం స్పందించి ఆయన విడుదలకు కృషి చేయాలి.



