…………………..
దేశంలో బిజెపి ని ఎప్పుడూ హేళన చేసే కమ్యూనిస్టుల అసలు రంగు ఎప్పుడైనా గమనించారా? సొంత పార్టీలు నాశనమై పోతున్నా సరే, వేరే ఎవరో గెలిచారని పండుగలు చేసుకునే బ్యాచ్ ఇది. ఈ విపరీతమైన మనస్తత్వానికి ఏమని పేరు పెట్టాలి? అసలు సిద్ధాంతం అంటూ ఏమీ లేకుండా, కేవలం ఒకరి ఓటమిని చూసి సంబరపడే మెంటాలిటీ ఏమిటి?
………………………..
బీహార్ ఉప ఎన్నికల ఫలితాలనే ఉదాహరణగా తీసుకుందాం. ప్రశాంత్ కిషోర్ పార్టీ గెలుపును చూసి తెగ పోస్టులు పెడుతున్నారు.
ఏకంగా మోదీ ఓడిపోయారంటూ పండుగ చేసుకుంటున్నారు. ఇందులో ఎక్కువ మంది కాంగ్రెస్, కమ్యూనిస్టు వీరాభిమానులు.
కానీ ఇక్కడ నవ్వొచ్చే విచిత్రం ఏమిటో తెలుసా? కాంగ్రెస్ , కమ్యూనిస్టు ల ఉమ్మడి అభ్యర్థి అక్కడ దారుణంగా మూడో స్థానానికి పడిపోయాడు .
చాలా చాలా తక్కువ ఓట్లకు పరిమితం అయ్యారు. ఈ
తీవ్రమైన వాస్తవాన్ని వీరు పూర్తిగా మరచిపోయారు!
….
సొంత పార్టీ మట్టికొట్టుకుపోతున్నా పర్లేదు కానీ, అవతలి వ్యక్తి ఓడిపోతే చాలు అనుకోవడమే వీళ్ళ గొప్పతనం? డిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ... బిజెపి మీద గెలిస్తే ఈ కాంగ్రెస్, లెఫ్ట్ వర్గాలు సంబరాలు చేసుకుంటాయి.. కానీ అక్కడ సొంత కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు మూడు సీట్లకు మాత్రమే పరిమితమై అడ్రస్ లేకుండా పోయిందనే నిజాన్ని దాచేస్తుంటారు.
……..
ఇక లెఫ్టిస్టులు, కమ్యూనిస్టుల పరిస్థితి అయితే మరీ దారుణం! పశ్చిమ బెంగాల్‌ను ఒకప్పుడు 35 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఏలిన కమ్యూనిస్టు పార్టీలు.. మొన్నటి దాకా తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే తామే గెలిచినట్లు పండగ చేసుకొనేవారు. దాదాపు నాలుగు దశాబ్దాలు పాలించిన సొంత రాష్ట్రంలో తమ పార్టీ డిపాజిట్లు కోల్పోయి 3 లేదా 4 సీట్లకు పడిపోయిందనే చేదు నిజాన్ని గ్రహించే స్పృహ కూడా వీరికి లేదు. కేరళ, బెంగాల్ అంటూ గొప్పలు చెప్పుకునే ఈ సూడో-లిబరల్స్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాంతీయ పార్టీకి పల్లకీలు మోస్తూ, సొంత ఉనికినే కాలరాసుకుంటున్నారు…
………………..
. బిజెపిని వ్యతిరేకించడం తప్ప తమకంటూ ఒక స్పష్టమైన విధానం కానీ, సిద్ధాంతం కానీ లేకపోవడమే ఈ విపక్షాల అసలు నైజం.
సొంత సిద్ధాంతాన్ని, సొంత పార్టీ ఉనికిని పక్కనబెట్టి.. కేవలం ద్వేషంతో ఇతరుల ఓటమిని ఆస్వాదించే ఇలాంటి అవకాశవాద రాజకీయాలను, నకిలీ లిబరలిజాన్ని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. పార్టీలు నాశనమవుతున్నా కళ్లు తెరవని ఈ విచిత్రమైన ‘అంధ భక్తి’ ఎక్కడికి దారితీస్తుందో రాబోయే రోజుల్లో ఆయా పార్టీల మద్దతుదారులే తెలుసుకోవాల్సి ఉంది.
……….
దేశ ప్రయోజనాలను, జాతీయవాద భావజాలాన్ని బలంగా వినిపిస్తూ.. ఇలాంటి అవకాశవాద రాజకీయాలను ఎండగడుతున్న మీ అభిమాన MyInd Media ఛానెల్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్!



