…………………………………………………………………………….
నమస్కారం! పన్ను చెల్లించే పౌరులకు సంక్షేమ ఫలాలు అందడంలో మతం ప్రమాణంగా మారవచ్చా? ఒకే సమాజంలో ఉంటూ.. ఒక వర్గం ఆడపిల్లలకు ఉచిత చదువు, మరో వర్గం ఆడపిల్లలకు ఆ అవకాశం లేకపోవడం న్యాయమేనా? అసలు సెక్యులర్ ప్రభుత్వాకి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏమిటి? రాజకీయం కోసం వేసే ఉచిత పథకాల ఎరలు, సమాజంలో ఎలాంటి అసమానతలకు దారితీస్తున్నాయి? కొత్త రాజకీయాలంటూ వచ్చిన తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ….. పెద్ద చర్చకు దారితీసింది. పన్నుల డబ్బుతో ప్రభుత్వాలు మతాధారిత రాజకీయం ఎలా చేస్తున్నాయి? ఈ వివాదం వెనుకున్న అసలు విషయాలు.. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం…
—…………………………………………………….
తమిళనాడులో కొత్తగా ఏర్పడిన TVK ప్రభుత్వం.. కీలక ప్రకటనలు చేసింది. ముస్లిం మహిళా స్టూడెంట్స్ అందరికీ.. డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో 100% Tuition Fees చెల్లించనున్నారు. దీనికి ప్రారంభ బడ్జెట్‌గా 20 కోట్లు కేటాయించారు. దీంతో పాటు 1 నుంచి 8 తరగతుల వరకు ఉండే వక్ఫ్ బోర్డు స్కాలర్షిప్ను 9, 10 తరగతులకు విస్తరించారు. దీంతో 40వేల మందికి పైగా ముస్లిం స్టూడెంట్స్ కు ఏడాదికి 2 వేల మేర ఆర్థిక సాయం అందించనున్నారు. చెన్నైలో మైనారిటీ మహిళల కోసం ప్రత్యేకంగా కళాశాల నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు.
………………
అయితే, వివాదం విద్యార్థులతోనే ఆగలేదు. మసీదులు, చర్చిలు, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులను వ్యాపార సంకీర్ణాలు, కళ్యాణ మంటపాలుగా అభివృద్ధి చేసుకోమన్నారు. దీని కోసం 100 కోట్ల నిధితో వడ్డీ లేని రుణాలు అందించే రికవరింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చెన్నైలో తమిళనాడు వక్ఫ్ బోర్డు కొత్త హెడ్‌క్వార్టర్స్ నిర్మాణం కోసం 40 కోట్లను కేటాయించారు. ఇప్పటికే తమిళనాడుపై 13.18 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. ఇలాంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో.. ఆర్థిక వెనుకబాటుతనం కాకుండా కేవలం “మతం” ప్రాతిపదికన ఉచితాలు ఇవ్వడం కరెక్టేనా.. ముస్లింలు, క్రైస్తవుల కోసం ఈ మాదిరిగా పంచుకోవటం పోవటం కరెక్టేనా.. అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
—……………………………………………………………….
పేదరికం అనేది ఒక మతానికి పరిమితమైనది కాదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లేదా మరే ఇతర వర్గంలోనైనా పేద విద్యార్థులు ఉంటారు. మరి ఉచిత విద్యను కేవలం ఆర్థికంగా వెనుకబడిన అందరి ఆడపిల్లలకూ అందించకుండా, ఒకే మతానికి పరిమితం చేయడం సబబేనా? హిందూ ఆలయాల నిధులు, పన్ను చెల్లింపుదారుల డబ్బును .. అందరి సంక్షేమానికి వాడుకోవటంలేదు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఇలాంటి పథకాలకు కేటాయించడంపై అంతా ఆలోచించాలి. రాజ్యాంగం చెప్పిన లౌకికత్వానికి ఇవి నిజంగా అర్థం పడుతున్నాయా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
—
ఇలాంటి అనేక కీలకమైన అంశాలు, జాతీయ దృక్పథంతో కూడిన నిజాలు మరియు లోతైన విశ్లేషణలను నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకువస్తోంది మన మై ఇండ్ మీడియా . జాతీయవాదాన్ని అందరికీ వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియ ఛానెల్‌ను తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేయండి. సమాజంలో చైతన్యం నింపేందుకు ఈ వీడియోను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు!




