………………………………………………
నమస్తే! హిందూ దేవుళ్లను దూషిస్తూ వార్తల్లోకి వచ్చిన కాక్రోచ్ పార్టీ నేత నిషూ ఆజాద్ ఇంట్లోని విజువల్స్ అబద్ధమా? తన ఇంటిపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారంటూ ఆమె చేసిన ప్రచారాన్ని పక్కింటి వారే ఎందుకు ఖండించారు? సిసిటివి ఆధారాలు, నివాసితుల వాస్తవ ప్రకటనల ముందు ఆమె ప్రచారం ఎలా విఫలమైంది? సానుభూతి కోసమే ఆమె ఈ డ్రామా ఆడారా? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
………………………………………………
ఘాజియాబాద్‌లోని షాలిమార్ గార్డెన్లో నివసించే కాక్రోచ్ పార్టీ నేత నిషూ ఆజాద్ కొత్త వివాదం బయట పెట్టారు. తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. తన ఇంటిని కొంతమంది చుట్టుముట్టి రాళ్లు, ఇటుకలతో దాడి చేశారని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని హంగామా చేశారు. ఇంకేముంది, సోషల్ మీడియాలో రచ్చ మొదలై పోయింది. ఐ సపోర్ట్ నిషూ అంటూ హ్యాష్ ట్యాగ్ లు మొదలై పోయాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని తిడుతూ.. పోస్టులు వెల్లువెత్తిపోయాయి.
……….
అయితే, ఇదంతా ఒక డ్రామా అని బయట పడింది. వాస్తవాలను అక్కడ సొసైటీ వాసులే బయట పెట్టారు. రాత్రి 2 గంటల వరకు సొసైటీ గుడి వద్ద కార్యక్రమం జరుగుతోందని, ఎలాంటి రాళ్లదాడి లేదా గొడవ జరగలేదని పొరుగువారు స్పష్టం చేశారు. సొసైటీకి పటిష్టమైన భద్రత ఉందని, సీసీటీవీ ఫుటేజీలో ఎలాంటి అసాధారణ కదలికలు లేవని చెప్పారు. అసలు నిషూ ఆజాద్ ఇంటి కిటికీలు కూడా పగలలేదని పొరుగువారు తెలిపారు. గతంలో హిందూ దేవతలను అవమానిస్తూ పోస్టులు పెట్టినందుకే లాయర్లు ఆమెపై పోలీసు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి, సానుభూతి పొందేందుకే ఆమె ఈ తరహా రాళ్లదాడి డ్రామాలు ఆడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
……………………………………………………………
సమాజంలో చౌకబారు ప్రచారం కోసం, సొంత మతాన్ని మరియు దేవతలను దూషించడం కొంతమందికి అలవాటు అయిపోయింది. ఆ తర్వాత నకిలీ దాడి డ్రామాలతో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కాక్రోచ్ పార్టీ పేరుతో చేస్తున్న డ్రామాలన్నీ నెమ్మదిగా బయట పడుతున్నాయి. అందుచేత ఆధారాలు లేని అబద్ధపు ప్రచారాలతో బురద చల్లే వారి మీద చర్యలు తీసుకోవాలి.
………….
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్క్రైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నకిలీ డ్రామాలను, నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!




