ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ ఉగ్ర కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ప్రశాంతంగా ఉండే విజయవాడ నడిబొడ్డున కూర్చుని దేశాన్ని ముక్కలు చేయడానికి స్కెచ్ వేసింది ఎవరు? మన కళ్ల ముందే తిరుగుతూ, మన జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఎగురవేయాలని కలలు కంటున్న ఆ దేశద్రోహుల ప్లాన్ ఏంటి? జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జరిపిన మెరుపు దాడుల్లో బయటపడ్డ ఆ దిగ్భ్రాంతికరమైన నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
విజయవాడలోని వించిపేట ప్రాంతంలో బుధవారం ఉదయం నుండి ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇటీవల విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎన్ఐఏకు బదిలీ అయిన ఒక కేసు విచారణలో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సోషల్ మీడియాపై నిఘా ఉంచి ఈ ముఠా నెట్‌వర్క్‌ను ఛేదించింది. ఈ కేసులో విజయవాడకు చెందిన మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్, ఎండీ డానిష్, మీర్జా సోహైల్ బేగ్‌లతో పాటు హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగం, కర్ణాటకకు చెందిన అబ్దుల్ సలాంలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి ఎనిమిది రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది నిందితుల పేర్లు ఉండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
….
వీరంతా ‘అల్-మాలిక్ ఇస్లామిక్ యూత్’ అనే గ్రూపుగా ఏర్పడి, విదేశీ హ్యాండ్లర్ అల్-హకీమ్ షుకూర్ నిర్దేశకత్వంలో ఐసిస్, అల్-ఖైదా నెట్‌వర్క్‌ను భారత్‌లో విస్తరించడానికి పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. నిందితులు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా ‘BENX COM’ అనే రహస్య గ్రూపులను క్రియేట్ చేసి, అందులో కొంతమంది పాకిస్ధానీయులను కూడా సభ్యులుగా చేర్చుకున్నారు. ఈ గ్రూపుల ద్వారా జిహాద్ కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న యువతను బ్రెయిన్ వాష్ చేసి ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేవారు. వీరికి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో స్నైపర్ రైఫిళ్లు, గన్స్, ఐఈడీ బాంబుల తయారీలో శిక్షణ ఇప్పించడానికి కూడా ప్లాన్ చేశారు. అంతేకాదు, హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగం నాయకత్వంలో ప్రత్యేకంగా ఒక మహిళా వింగ్‌ను ఏర్పాటు చేసి దేశంలో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయాలని కుట్ర పన్నారు. ప్రస్తుతం వీరిపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసి ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
……
ఈ పరిణామాలు చూస్తుంటే ఉగ్రవాద ముఠాలు మన సమాజంలో ఎంతలా చొరబడ్డాయో అర్థమవుతోంది. అందుకే ప్రజలారా, మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులు, దేశ వ్యతిరేక గ్రూపులు, అపరిచిత వ్యక్తుల ప్రలోభాల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలి. మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నా, దేశ భద్రతకు భంగం కలిగించేలా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో చాటింగ్ చేస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. మన అప్రమత్తతే మన దేశానికి రక్షణ కవచం.
…
దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలే పరమావధిగా మీకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను, విశ్లేషణలను అందిస్తున్న మన ‘మై ఇండ్ మీడియా’ ఛానల్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.



