……………………………………………………………………….
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పేరుతో జరిగిన అల్లర్లకు.. అసలు రంగు బయటపడింది. ప్రజా సమస్యలు, విద్యార్థుల భవిష్యత్తు పేరిట ఆందోళనలు చేపడుతున్నామని చెబుతున్నారు. కానీ, వాస్తవానికి సమాజంలో అలజడి సృష్టించేందుకు తీవ్ర నేర చరిత్ర ఉన్న వ్యక్తులను రంగంలోకి దించినట్లు వెల్లడైంది. ఢిల్లీ పోలీసులు సాంకేతికతను ఉపయోగిస్తూ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వ్యాన్ల ద్వారా నిరసన ప్రదేశంలో నిఘా పెట్టారు. అక్కడ ఊహించని రీతిలో భారీ సంఖ్యలో క్రిమినల్స్ సంచరిస్తున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
………………….
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. ఆ నిరసన కార్యక్రమంలో ఏకంగా 2,873 మంది నేరపూరిత చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నట్లు స్పష్టమైంది. వీరిలో 101 మంది హత్య కేసుల్లో నిందితులుగా ఉండగా, 62 మంది హత్యాయత్నం కేసుల్లో నిందితులు. 284 మంది దోపిడీ కేసుల్లో భాగస్వాములుగా ఉన్నారు. తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడిన 61 మంది రేప్ నిందితులు, 06 మంది పోక్సో కేసులు ఎదుర్కొంటున్న వారు, మరియు 25 మంది మహిళలపై వేధింపుల కేసుల్లో ఉన్న నేరస్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అక్రమ ఆయుధాల చట్టం కింద 229 మంది, చైన్ స్నాచింగ్ వంటి కేసుల్లో 135 మంది, అపహరణ కేసుల్లో 19 మంది, అలాగే మాదకద్రవ్యాల కేసుల్లో 67 మంది నిందితులు అని తెలుస్తోంది.
…………………………………………………..
ఈ ఆందోళనల్లో భాగస్వాములైన వారంతా విద్యార్థుల ముసుగులో రావడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. నిజమైన విద్యార్థుల భవిష్యత్తు, సమస్యల పేరుతో ముందుకొచ్చిన వీరంతా వాస్తవానికి క్రూరమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కావడం, ప్రజాస్వామ్యయుత నిరసనల ముసుగులో ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో చాటిచెబుతోంది. చదువుకునే విద్యార్థుల వేషధారణలో వచ్చి, శాంతియుతంగా జరిగే ఆందోళనలను హింసాత్మకంగా మార్చేందుకు, రౌడీయిజంతో అశాంతిని సృష్టించేందుకే ఈ నేరస్థుల మూకలు అక్కడికి చేరినట్లు ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
……..
ఇలాంటి పరిస్థితుల్లో సమాజం, ముఖ్యంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హక్కుల పోరాటాలు, నిరసనల పేరిట జరుగుతున్న ఆందోళనల వెనుక ఎలాంటి అరాచక శక్తులు, నేరస్థులు దాగి ఉన్నారో గమనించాలి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, వారిని డాలుగా వాడుకునే ఇటువంటి చట్టవ్యతిరేక మూకల పట్ల మరియు రాజకీయ స్వార్థ శక్తుల పట్ల ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించాలి.



