…………………..
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమ సభ్యులతో
కలిసి పార్లమెంటు ను అడ్డుకొంటున్నారు. కాక్రోచ్ పార్టీ ఆందోళన సమయం లో పెల్లెట్ బుల్లెట్లు వాడకంపై మండిపడుతున్నారు. ఇందుకు హోం మంత్రి అమిత్ షా జవాబు ఇవ్వాలని పదే పదే డిమాండ్ తీస్తున్నారు. ఈ లోగా సుప్రీం కోర్టు.. రాహుల్ గాంధీ గాలి తీసేసింది.
…………..
ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ‘సంసద్ చలో’ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులు బారికేడ్లను తోసుకుంటూ పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేయడానికి భద్రతా బలగాలు లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ తో పాటు పెల్లెట్ తుపాకులను ఉపయోగించాల్సి వచ్చింది.
ఈ ఘటనలో కొందరు నిరసనకారులకు పెల్లెట్ గాయాలు అయ్యాయి. దీని మీద కొందరు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా అల్లర్ల నివారణకు పెల్లెట్ తుపాకుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, బాధితులకు నష్టపరిహారం మరియు ఉచిత వైద్యం అందించాలని కోరారు.
………….
ఈ పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పెల్లెట్ తుపాకులపై దేశవ్యాప్త పూర్తి నిషేధం విధించేందుకు నిరాకరించింది. తీవ్రమైన అల్లర్లు మరియు అత్యవసర పరిస్థితుల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అంచెలవారీగా బలప్రయోగం చేయడానికి ప్రస్తుత పోలీస్ నిబంధనలు అనుమతిస్తున్నాయని, అందువల్ల ప్రత్యక్ష నిషేధం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
అదే సమయంలో గాయపడిన వారికి తగిన వైద్య సౌకర్యాలు కల్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది., ఆ రోజు రక్షణ బలగాలు ఉపయోగించిన ఆయుధాల లాగ్ వివరాలను భద్రపరచాలని కేంద్రాన్ని కోరింది.
………….
నిరసనలు తీవ్ర రూపం దాల్చినప్పుడు భద్రతా బలగాలు శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో తీసుకునే చర్యల ప్రాధాన్యతను ఈ తీర్పు పునరుద్ఘాటించింది.
విద్యార్థుల సమస్యల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం హింసను రెచ్చగొట్టాలని చూసిన విపక్షాల కుట్రలకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చెక్ పెట్టాయి. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు, భద్రతా బలగాల ఆత్మస్థైర్యానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను, చట్టబద్ధ పాలనకు కేంద్రం కట్టుబడి ఉన్న తీరును ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ, కాక్రోచ్ నేతల అరుపులు, పెడ బొబ్బలకు సుప్రీం కోర్టు చెక్ పెట్టింది.



