ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడిపోతున్న వేళ.. గ్లోబల్ మార్కెట్లో డాలర్ సామ్రాజ్యం కుప్పకూలుతున్న వేళ.. అసలు భారతదేశం మాత్రం ఇంత సురక్షితంగా, ఇంత పటిష్టంగా ఎలా ముందుకు దూసుకెళ్తోంది? ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి నడుస్తున్నా.., దేశ సంపదను కాపాడుతున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? మన దేశ ఆర్థిక రథాన్ని అంతర్జాతీయ ముప్పుల నుండి తప్పించి, సురక్షిత తీరాలకు చేరుస్తున్న ఆ ఇద్దరు చాణక్యులు ఎవరు? భారత రిజర్వు బ్యాంక్ సృష్టించిన ఆ సరికొత్త గోల్డెన్ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్ టెన్షన్లు నడుస్తున్నాయి. గల్ఫ్ యుద్ధం తర్వాత అమెరికా ఎప్పుడు ఏ దేశంపై ఆంక్షలు విధిస్తుందో, డాలర్ నిల్వలను ఎప్పుడు ఫ్రీజ్ చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో గ్లోబల్ మార్కెట్లో కేవలం డాలర్‌ను నమ్ముకుంటే ప్రమాదమని భావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అత్యంత తెలివిగా, పకడ్బందీగా మన ఆర్థిక వ్యూహాన్ని మార్చేశారు. వారి మార్గదర్శకత్వంలో భారత రిజర్వు బ్యాంక్ సైలెంట్‌గా ఒక భారీ గోల్డ్ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తోంది. విదేశీ కరెన్సీ కంటే బంగారమే అత్యంత సురక్షితమైన ఆస్తిగా భావిస్తూ.. వరుసపెట్టి టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ అద్భుత వ్యూహం కారణంగానే ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఉన్న బంగారు నిల్వల విలువ అక్షరాలా 115.8 బిలియన్ డాలర్లకు.. అంటే మన రూపాయిల్లో దాదాపు రూ. 9.66 లక్షల కోట్లకు చేరింది. విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా గత ఏడాది కేవలం 12 శాతంగా ఉంటే, ఇప్పుడది ఏకంగా 17 శాతానికి పెరగడం మోడీ ప్రభుత్వ ఆర్థిక చతురతకు నిదర్శనం.
….
భారత విదేశీ మారక నిల్వల చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో బంగారాన్ని దాచి ఉంచడం ఇదే తొలిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన దేశ గోల్డ్ గ్రాఫ్ ఎలా పెరిగిందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2015 లో ఆర్బీఐ వద్ద ఉన్న గోల్డ్ నిల్వలు కేవలం 557.8 టన్నులు మాత్రమే. కానీ 2026 నాటికి అవి ఏకంగా 880.5 టన్నులకు చేరాయి. ప్రపంచంలోనే అత్యధిక గోల్డ్ రిజర్వ్స్ ఉన్న అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ లాంటి అగ్రదేశాల లీగ్‌లోకి దూసుకెళ్లేలా చేశారు. ఆర్బీఐ దగ్గర ఉన్న 880 టన్నుల బంగారం ఒక ఎత్తయితే.. మన దేశంలోని ఇళ్లల్లో, దేవాలయాల లాకర్లలో ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం అక్షరాలా 32,000 టన్నులు. దీని విలువ ఊహకందని విధంగా . 351.4 లక్షల కోట్లు. ప్రపంచంలో మరే దేశంలోనూ ప్రజల వద్ద ఈ స్థాయిలో సంపద లేదు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యూహాత్మకంగా ఆర్బీఐ నిల్వలను పెంచడం ఒకటైతే, భారతీయుల రక్తంలోనే ఉన్న గోల్డ్ సెంటిమెంట్ మరొకటి.
…
అందుకే దేశ ప్రజలారా, అంతర్జాతీయంగా ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు వచ్చినా మన భారతదేశం వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఏ దేశానికి లేదు. మన దేశ నాయకత్వం తీసుకుంటున్న పటిష్టమైన, ముందస్తు ఆర్థిక నిర్ణయాల పట్ల మనమంతా గర్వించాలి. గ్లోబల్ మార్కెట్లో వచ్చే గాలివాటపు వార్తలను నమ్మి ఆందోళన చెందకుండా, మన దేశ ఆర్థిక వ్యవస్థపై పూర్తి నమ్మకంతో ఉండండి. ఇలాంటి అద్భుతమైన ఆర్థిక వ్యూహాలు, దేశ పురోగతికి సంబంధించిన నిజాలను తెలుసుకుంటూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత.
దేశ భద్రత, ఆర్థిక ప్రగతి, దేశోన్నతిని కాంక్షిస్తూ.. జాతీయ వాదాన్ని ఎల్లప్పుడూ అందిస్తున్న మన ‘మై ఇండ్ మీడియా’ ఛానల్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై హింద్, జై భారత్.




