పాకిస్థాన్ లో చీకటి రాజ్యం.. రోజంతా పవర్ కట్ లే.. పాకిస్థాన్ లోని ప్రజల దుస్థితి పై నిప్పు లాంటి విశ్లేషణ
…………….
నమస్తే,
అమెరికా, ఇరాన్ కు రాజీ కుదిర్చాము, ప్రపంచ యుద్ధాలను ఆపేస్తున్నాము అని పాకిస్థాన్ గొప్పలు చెబుతూ ఉంటుంది. మన దేశంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఈ మాటతో చెలరేగిపోతూ ఉంటారు. పాకిస్థాన్ చేసినంత కూడా,మన ప్రభుత్వం చేయలేక పోయింది అని పాకిస్తాన్ కు భజనలు చేస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్ లో… అసలు విషయాలు మీకు తెలుసా.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి… కనీస అవసరాలైన విద్యుత్, నీళ్లు అందించలేని దుస్థితి..? పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏకంగా 24 గంటల పాటు చీకట్లోనే గడపాల్సి వస్తే ఆ ప్రజల ఆక్రందనలు ఎలా ఉంటాయి? గ్యాస్ కొనడానికి డబ్బులు లేక, అంతర్జాతీయంగా ధరలు పెరిగిపోయాయని పౌరులను ఎలా గాలికొదిలేసింది? కరాచీ నుంచి లాహోర్ వరకు కరెంట్ లేక చీకటిలో మునిగిపోవడానికి అసలు కారణాలు ఏమిటి? పాకిస్తాన్లో తీవ్రమైన ఈ పవర్ క్రైసిస్ వెనుకున్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం…
…………………………………………………………………………..
పాకిస్తాన్లో విద్యుత్ సంక్షోభం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దే శంలో దాదాపు 4,000 మెగావాట్లకు పైగా విద్యుత్ కొరత ఏర్పడటంతో ప్రధాన నగరాల్లో భారీగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని నార్త్ కరాచీ, నాజిమాబాద్, గులిస్తాన్-ఇ-జౌహర్ వంటి ప్రాంతాల్లో రోజుకు 16 నుంచి 24 గంటల పాటు కరెంట్ కోతలు అమలవుతున్నాయి. ఈ విద్యుత్ కోతల వల్ల తాగే నీరు అందక, వ్యాపారాలు సాగక, చిన్న పిల్లల చదువులు సాగక ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు.
…
ఈ ఘోరమైన అంధకారానికి ప్రధాన కారణం ఇంధన కొరతే. పాకిస్తాన్ విద్యుత్ ప్లాంట్లు నడవడానికి అవసరమైన లిక్విడ్ సహజవాయువు కొనుగోలు చేయలేకపోతున్నారు. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ ధరలు విపరీతంగా పెరగడంతో, అత్యవసర టెండర్లను కూడా ప్రభుత్వం రద్దు చేసుకుంది. దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్యం లేకపోవడం, విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల కనీసం సాయంత్రం వేళల్లో కూడా కరెంట్ ఇవ్వలేని స్థితికి పాకిస్తాన్ చేరుకుంది. ఇదీ పాకిస్థాన్ అసలు స్వరూపం.
…………………………………………………………………………………..
ప్రభుత్వాల చేతకానితనం.. ఎంతటి దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయో అనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రాథమిక సౌకర్యాలైన విద్యుత్, నీటిని కూడా ప్రజలకు అందించలేక పోవడం పాకిస్థాన్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. మౌలిక వసతుల కల్పనను పక్కనపెట్టి, ఉచితాలు మరియు ఇతర అంశాలపై దృష్టి పెడితే ఏ దేశమైనా ఆర్థికంగా ఎలా కుప్పకూలిపోతుందో గ్రహించి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
………………………………………
ఇలాంటి అనేక కీలకమైన అంశాలు, జాతీయ దృక్పథంతో కూడిన నిజాలు మరియు లోతైన విశ్లేషణలను నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకువస్తోంది మన మై ఇండ్ మీడియా. జాతీయవాదాన్ని అందరికీ వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేయండి. సమాజంలో చైతన్యం నింపేందుకు ఈ వీడియోను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు!



