……………
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే వార్తలు .. కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఆయన కిర్గిజ్‌స్థాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో, విమానం మెట్లు దిగుతూ తన భార్య పెంగ్ లియువాన్ చేతిని గట్టిగా పట్టుకున్నారు. చాలా మెల్లగా, తడబడుతూ నడవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు బయటకు రావడంతో ఆయన శారీరక ఆరోగ్యం క్షీణించిందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, ఈ అంశంపై చైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. , భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
……
చైనా చట్టాల ప్రకారం అగ్ర నాయకుల ఆరోగ్యం అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు, అది దేశ భద్రతతో ముడిపడి ఉన్న అత్యున్నత రాష్ట్ర రహస్యం. ఈ నిబంధనల వల్ల దేశాధినేతల శారీరక స్థితిని సాధ్యమైనంత వరకు రహస్యంగా ఉంచుతారు. చైనా రాజకీయ వ్యవస్థ పూర్తిగా షీ జిన్‌పింగ్ ఒక్కరి చుట్టూనే కేంద్రీకృతమై ఉంది. ఆయనకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిస్తే కష్టమే., కమ్యూనిస్ట్ పార్టీ లోపల అధికార పోరాటాలు మొదలై తీవ్ర రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది.
మరోవైపు, జిన్‌పింగ్ అనారోగ్యంపై అధికారికంగా స్పందిస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడంతో పాటు ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం సడలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి వార్తలు బయటకు రాకుండా అంతర్గతంగా కఠిన చర్యలు తీసుకుంటారు.
…….
కమ్యూనిస్ట్ సిద్ధాంతాల ప్రకారం దేశాధినేత ఎల్లప్పుడూ అత్యంత శక్తివంతంగా, దృఢంగా కనిపిస్తూ నాయకత్వం వహించాలి. నాయకుడు బలహీనపడ్డాడని తెలిస్తే అంతర్జాతీయ వేదికలపై అమెరికా వంటి ప్రత్యర్థి దేశాల ముందు చైనా ప్రతిష్ట దెబ్బతింటుందని భావిస్తారు. ఈ కారణాల వల్ల చైనా అంతర్గత రాజకీయ, ఆరోగ్య సమాచారం బయటి ప్రపంచానికి రాకుండా అత్యంత కఠినమైన నియంత్రణలను అమలు చేస్తున్నారు.



