భారతదేశంలో హిందువులు మెజారిటీ జనాభా కాదంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యుడు మౌలానా సజ్జాద్ నొమాని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వివిధ సామాజిక వర్గాలను విడివిడిగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. హిందువుల జనాభా గణనీయంగా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. జనాభా వర్గీకరణ మరియు మతపరమైన గుర్తింపులపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
……………………………..
దేశ జనాభా లెక్కల నుండి పలు సామాజిక వర్గాలను మినహాయించాలని నొమాని డిమాండ్ చేశారు.
షెడ్యూల్డ్ కులాలకు హిందువులతో సంబంధం లేదంటున్నారు. కర్నాటకలోని లింగాయతులు ది వేరే మతం అంటున్నారు. మొత్తంగా తమిళనాడు ప్రజలంతా ద్రావిడులు కాబట్టి హిందువులు కాదని వాదిస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రాచీన మూలవాసులైన గిరిజనులు అసలు హిందువులే కారని మౌలానా సజ్జాద్ నొమాని స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశంలో బలమైన సామాజిక వర్గమైన జాట్లు కూడా హిందువుల కిందకు రారు అంటున్నారు.
అందుచేత ఈ క్యాటగిరీ ప్రజలను హిందూ జనాభాలో లెక్కించకూడదని, వేర్వేరు కేటగిరీ లు ఉండాలని వాదిస్తున్నారు.
……………………………………………………………………………………………
మౌలానా సజ్జాద్ నొమాని చేసిన ఈ వ్యాఖ్యలపై దేశంలోని పలు రాజకీయ పక్షాలు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాజాన్ని కులాలు, మతాల వారీగా విడదీయడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
పర్సనల్ లా బోర్డ్ సభ్యులు మౌలానా నొమాని వివాదాస్పద వ్యాఖ్యలు..

Share: